మంగళగిరి/తాడేపల్లి: ఈ నెల 28న హైదరాబాద్ మహాన్యూస్ టి.వి,ఛానల్ కార్యాలయంపై,ఉద్యోగుల మీద బి.ఆర్.ఎస్ కార్యకర్తలు కొందరు దాడులకు తెగబడి,అక్కడ ఉద్యోగులను బలమైన కర్రలు,ఇనుప రాడ్లతో భయపెట్టి కార్యాలయం ఫర్నిచర్,ఆఫీసు అద్దాలు పగలగొట్టిన ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.ప్రధానంగా అమరావతిలో రాజధాని ముఖ్య నగరం మంగళగిరి/తాడేపల్లి (MTMC) పరిధిలో జర్నలిస్టులు నిరసన కార్య క్రమాలతో కదం తొక్కారు. ఇటు నగరంలో మంగళగిరి ప్రెస్ క్లబ్,అటు తాడేపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంగళగిరిలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం సాయంత్రం జర్నలిస్టులు నిర్వహించిన రాస్తారోకో,నిరసన కార్యక్రమాలకు నగరంలో గల పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ర్యాలీ గా వెళ్ళిన జర్నలిస్టులు స్థానిక తాహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ డిప్యూటీ తహశీల్ధార్ కి ఓ వినతిపత్రం అందజేశారు.
అనంతరం “మంగళగిరి ప్రెస్ క్లబ్” అధ్యక్షులు వాన పల్లి బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు మీడియా స్వేఛ్చని హరిస్తున్నాయని అన్నారు.‘మహాన్యూస్’ కార్యాలయం పై దాడికి పాల్పడినవారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుని పత్రికా స్వేచ్ఛని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ..మీడియాపై దాడిని అన్నిపార్టీలు ఖండించాలన్నారు.ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మీడియా సంస్థలు,మీడియా ప్రతినిధులపై దాడులు సరికాదన్నారు.ఇందుకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే దళిత సంఘాల నాయకులు కారుమంచి రామారావు మాట్లాడుతూ రాజకీయ నాయకులువారి గొప్పలు చెప్పుకోవడానికి మీడియాలు కావాలి కానీ, వారి తప్పులను వెలికితీస్తే దాడులు చేస్తారా…అని ఆయన ప్రశ్నించారు.మీడియా ప్రతినిధులపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు చెప్పారు.అలాగే విద్యార్థి సంఘాల నాయకులు బాలాజీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా మీడియా ద్వారా తెలుస్తుందని అన్నారు.అటువంటి మీడియా సంస్థలపై దాడులు ఏ మాత్రం సరైంది కాదన్నారు.ఇప్పటికైనా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటు వంటి ఘటనలు పునఃరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
జర్నలిస్టులు బి.దయాకర్, ఎం.సిరిబాబు,ఈపూరి రాజారత్నం,ఎస్.శ్రీనివాస రావు,నాయుడు నాగరాజు, టి.శ్రీనివాసరావు, సీ.హెచ్. కళ్యాణ్, బత్తుల సాంబశివ రావు, విడేల సాయి శ్రీనివాస్(వాసు), ఎన్.శివన్నారాయణ, చదలవాడ సాయి చంద్, వెంకట్, ఎస్.కే.సుభాని, ఎం.మస్తాన్, ఎం.కిషోర్, బండారు సాంబశివరావు, జీ.దుర్గారావు, అన్వర్, సురేష్, గుప్తా, శివరాత్రి శ్రీనివాసరావు, వేముల రాంబాబు, ఆరేపల్లి రాజు, సందు రామకృష్ణ, ఇందనం నాగరాజు పలువురు జర్నలిస్టులతో పాటు కొందరు రాజకీయ పార్టీల స్థానిక నాయకులు మరియు ప్రజా సంఘాల,దళిత సంఘాల నాయకులు కొందరు పాల్గొన్నారు.
తాడేపల్లి జర్నలిస్టులు తాహశీల్దార్ కి వినతిపత్రం అందజేత.

మరో ప్రక్క ఇదే అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ నగర పరిధిలో తాడేపల్లి పట్టణం లో “తాడేపల్లి ప్రెస్ క్లబ్” సభ్యులైన జర్నలిస్టులు స్థానిక తాహశీల్దార్ డి. సీతారామయ్యకు వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు జొన్న వెంకటేష్, తక్కెళ్ళపాటి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.మీడియాపై దాడి చేయడాన్ని వీరు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.ఏ మీడియా సంస్థపై దాడి చేసింది ఎవ రైనా సరే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.మీడియా కథనాల పై అభ్యంతరాలు ఉంటే ఖండన వెయ్యమని అడగవచ్చు అన్నారు.అది కాకపోతే న్యాయ స్థానంలో సదురు ప్రతినిధిపై కేసు వేయవచ్చని చెప్పారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై భౌతిక దాడులకు దిగటం, కార్యాలయ ఆవరణలోని వాహనాలను ధ్వంసం చేయటం సరైన పద్ధతి కాదని వారు హితవు పలికారు.వినతిపత్రం అందజేసిన వారిలో తాడేపల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షు లు కటికల కమల్ కుమార్, ప్రెస్ క్లబ్ కోశాధికారి పామర్తి సుబ్రమణ్యం,సభ్యులు తాడిబోయిన నాగేశ్వరరావు,శిరందాసు శ్రీనివాసరా వు,తుడిమెల్ల రాంబాబు, పానేం ప్రదీప్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.



