సీనియర్ జర్నలిస్ట్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

మంగళగిరి;గుంటూరు జిల్లా మంగళగిరిలో సీనియర్ జర్నలిస్ట్ చందు రామకృష్ణ (ఆర్కే నాయుడు) పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు.

ఈ మేరకు ఆర్కే, “మంగళగిరి ప్రెస్ క్లబ్” అసోసియేషన్ సభ్యులతో కలిసి సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ వీరా స్వామికి ఫిర్యాదు చేశారు.ఆదివారం రాత్రి 11.30 గంటల సమయం లో ఏపీ07సివై 1239 అనే నంబర్ గల తన కారులో  వస్తుండగా, కారును పట్టణ పరిధిలో గల ఐసిఐసిఐ బ్యాంకు వద్ద  కొందరు అడ్డగించినట్లు రామకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కారు గ్లాస్ క్రిందకు దింపి ఎందుకు అడ్డగించారని అడగ్గా, తనను  అసభ్య  పదజాలంతో దూషిస్తూ, ముఖంపై బలంగా దాడి చేశారని తన ఫిర్యాదులో తెలిపారు.కారులో నుండి బయటకు ఈడ్చి క్రింద పడేసి త్రొక్కారని ఆయన పేర్కొన్నారు.వారి చేతుల్లో ఉన్న గాజు సీసాలతో తనను పొడిచే ప్రయత్నం చేశారని, ప్రాణభయంతో అక్కడి నుంచి తాను వెళిపోయినట్లు తెలిపారు.

    తన స్నేహితుల ద్వారా విచారించగా,స్థానిక బాప్టిస్ట్ పేటకు చెందిన కొందరు వ్యక్తులుగా అనిపించారని,వారితో పాటు మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనపై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.వీరు ఈ ప్రాంతంలో నిత్యం రాత్రుళ్లు మకాం వేసి వచ్చి పోయే వారిపై దాడులు చేస్తూ, భయ బ్రాంతులకు గురి చేస్తుంటారని స్థానికులు తెలిపారని, తనపై దాడి చేసి తనను గాయపరచిన  ఘటనను విచారించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సీనియర్ జర్నలిస్ట్ చందు రామకృష్ణ పేర్కొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి