మంగళగిరి: మంగళగిరి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బందెల దయాకర్ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వానపల్లి బ్రహ్మనాయుడు, గౌరవాధ్యక్షులు కూరపాటి మురళిరాజు హాజరయ్యారు.
జర్నలిస్టుల సమస్యలపై చర్చ
ఈ సందర్భంగా మాట్లాడిన వారు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ను కలిసి విన్నవించాలనే నిర్ణయం సమావేశంలో తీసుకున్నట్లు తెలిపారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకోవలసిన చర్యలపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
వృత్తిపరమైన శిక్షణ తరగతుల ప్రణాళిక
రాజధాని అమరావతిలో ప్రధాన నగరం మంగళగిరి వేదికగా త్వరలోనే జర్నలిస్టుల కోసం వృత్తిపరమైన శిక్షణ తరగతులు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం సి.ఆర్ మీడియా అకాడమీతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ శిక్షణ తరగతులు మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తుళ్ళూరు ప్రాంతాల జర్నలిస్టులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
సభ్యత్వ రశీదుల అందజేత
ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ సభ్యత్వం చెల్లించిన వారికి అధ్యక్షులు, గౌరవాధ్యక్షుల చేతుల మీదుగా రశీదులు అందజేయడం జరిగింది.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి బత్తుల సాంబశివరావు (సాంబ), గౌరవ సలహాదారులు ఈపూరి రాజారత్నం, శిరందాసు శ్రీనివాసరావు, టి. సతీష్, ఉపాధ్యక్షులు షేక్ సుభాని, సెక్రటరీ ఏం. సిరిబాబు, సహాయ కార్యదర్శులు చదలవాడ సాయిచంద్, గండికోట దుర్గారావు, కార్యవర్గ సభ్యులు శిరందాసు విజయభాస్కర్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, శివరాత్రి శ్రీనివాసరావు, వేముల రాంబాబు, మద్దెల కిషోర్, కట్టెపోగు నారాయణ, ఆరేపల్లి రాజు, కోనేటి వెంకటేష్, వి. రమేష్, అలాగే సభ్యులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



