మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ, రీజినల్ సినిమాల చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సాధించిన చిత్రంగా నిలిచింది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే రూ.84 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే కథాంశం ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. దీంతో రోజురోజుకీ కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి.
నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం, ఐదు రోజుల కలెక్షన్లకు సంబంధించి నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 5 రోజుల్లో మొత్తం రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్లతో రీజినల్ సినిమాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిందని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే 2.25 మిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించినట్లు నిర్మాతలు తెలిపారు. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు, ప్రేక్షకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో అదనపు షోలను కూడా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశారు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. భీమ్స్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.



