స్వలింగ సంబంధం కోసం బిడ్డను హతమార్చిన తల్లి – కృష్ణగిరి జిల్లాలో సంచలనం

మానవత్వాన్ని మర్చిపోయేంత స్థాయికి దిగజారిన ఓ తల్లి ఘోర నేరానికి పాల్పడింది. తన స్వలింగ సంబంధం అడ్డంకిగా మారిందని భావించి, కేవలం 6 నెలల వయస్సున్న సొంత కొడుకును ఆమె చంపేసింది. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుని స్థానికులను కుదిపేసింది.

కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్ (38) దినసరి కూలీగా పని చేస్తాడు. ఆరుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన భారతి (26)ని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల, నలుగేళ్ల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఐదు నెలల క్రితం భారతి మూడో బిడ్డకు, అబ్బాయి బిడ్డకు జన్మనిచ్చింది.

అనుమానాస్పద మరణం

నవంబర్‌ 4న భారతి తన బిడ్డకు ఫార్ములా పాలు ఇచ్చి నిద్రపుచ్చింది. కొంతసేపటికి బిడ్డ ఊపిరి ఆడకపోవడంతో భయపడిన కుటుంబ సభ్యులు బిడ్డను స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి, బిడ్డ మరణించాడని తెలిపారు. దీనితో బంధువులు బిడ్డను అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే బిడ్డ మరణం తర్వాత భారతి ప్రవర్తన సురేష్‌కి అనుమానం కలిగించింది. ఆమె దుఃఖం వ్యక్తం చేయకపోవడమే కాకుండా తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడం గమనించాడు. ఆమె లేని సమయంలో సురేష్ ఆమె ఫోన్‌ను పరిశీలించగా, మరో ఫోన్ కూడా దొరికింది. ఆ ఫోన్‌లో భారతి మరియు పొరుగింటి అమ్మాయి సుమిత్ర (20) కలిసి సన్నిహితంగా గడిపిన ఫోటోలు, వీడియోలు ఉండటంతో అతను షాక్‌కి గురయ్యాడు. అంతేకాక, భారతి తన చనిపోయిన బిడ్డ ఫోటోను సుమిత్రకు పంపినట్లు కూడా అతను గమనించాడు.

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

సురేష్ వెంటనే కెమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు భారతి మరియు సుమిత్రలను విచారించగా, భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నలుగేళ్ల క్రితం భారతి, సుమిత్ర పరిచయం పెరిగి, తరువాత అది స్వలింగ సంపర్క సంబంధంగా మారింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీరిద్దరూ కలుసుకుని సన్నిహితంగా గడిపేవారు. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు కూడా తీసుకునేవారు.

కానీ భారతి తన మగబిడ్డ పుట్టిన తర్వాత సుమిత్రతో సంభాషణ తగ్గించింది. దీంతో సుమిత్ర కోపంతో “నువ్వు నన్ను వదిలిపెట్టకూడదు” అంటూ బెదిరించిందట. ఆమెతో సంబంధం కొనసాగించాలనే ఒత్తిడికి భారతి తలొగ్గింది. నవంబర్‌ 5న బిడ్డకు పాలు ఇస్తున్న సమయంలో, గొంతు నులిమి హతమార్చినట్లు భారతి పోలీసుల ఎదుట అంగీకరించింది.

తల్లి చేతిలో బిడ్డ ప్రాణం కోల్పోవడం సంచలనం

ఈ ఘటన వెలుగులోకి రావడంతో చిన్నట్టి గ్రామం అంతా దిగ్భ్రాంతికి గురైంది. సొంత బిడ్డను చంపి స్వలింగ సంబంధాన్ని కొనసాగించాలనే తల్లి నిర్ణయం స్థానికులను కుదిపేసింది. పోలీసులు భారతి, సుమిత్రలను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు మహిళలు రిమాండ్‌లో ఉన్నారు.

ఈ ఘటన సమాజంలో విలువలు, మానవతా బావాలు ఎంతగా క్షీణిస్తున్నాయో మరోసారి స్పష్టం చేస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి