త్రిస్సూర్: సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు – 2025 ఫలితాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ వేడుక రామనాయకిలో ఘనంగా జరిగింది. మత్స్య, సంస్కృతి మరియు యువజన సంక్షేమ శాఖ మంత్రి సాజీ చెరియన్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో విజేతల జాబితాను ప్రకటించారు.
ఈ సంవత్సరం అవార్డుల కోసం మొత్తం 128 సినిమాలు నామినేట్ అయ్యాయి. వాటిలో 26 చిత్రాలు ఫైనల్ రౌండ్‌కి చేరగా, వాటిలో అత్యుత్తమమైన వాటిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ జ్యూరీ కమిటీకి అధ్యక్షత వహించగా, ఆయనతో పాటు ఏడుగురు సభ్యుల బృందం తీర్పు ఇచ్చింది. ప్రతి రోజు ఐదు చిత్రాలను వీక్షించి, ప్రతీ ప్రదర్శన తర్వాత విస్తృత చర్చల అనంతరం ఉత్తమ రచనలు, కళాకారులు, దర్శకులను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ ఏడాది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో అనేక కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించారు. ముఖ్యంగా, మమ్ముట్టి తన ‘బ్రహ్మయుగం’ చిత్రంలోని అద్భుత నటనతో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఇది ఆయనకు కేరళ ఫిల్మ్ స్టేట్ అవార్డుల్లో ఏడవ సారి దక్కిన గౌరవం కావడం విశేషం.
ఇక ఇతర విభాగాల్లో విజేతల జాబితా ఇలా ఉంది:
ఉత్తమ చిత్రం : మంజుమ్మెల్ బాయ్స్
ఉత్తమ ప్రజాధారణ పొందిన చిత్రం : ప్రేమలు
ఉత్తమ VFX : ARM
ఉత్తమ నటి : షమ్లా హంజా (ఫెమినిచి ఫాతిమా)
ఉత్తమ దర్శకుడు : చిదంబరం ఎస్. పొదువల్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులు (పురుషులు) : సౌబిన్ షాహిర్, సిద్ధార్థ్ భరతన్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు (మహిళ) : లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : చిదంబరం ఎస్. పొదువల్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ సంగీత దర్శకుడు : సుషీన్ శ్యామ్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ తెలుగు దర్శకుడు : ఫాసిల్ మొహమ్మద్ (ఫెమినిచి ఫాతిమా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ సినిమా పుస్తకం : “స్టార్ ఆక్రేసన్” – రచయిత సి. మీనాక్షి
ఉత్తమ కళా దర్శకుడు : అజయన్ చలిస్సేరి (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ నేపథ్య గాయని : జెబా టామీ
ఉత్తమ గాయకుడు : కేఎస్ హరిశంకర్
ఉత్తమ కథా రచయిత : ప్రసన్న వితనగే (పారడైజ్)
ఉత్తమ సాహిత్యం : వేదన్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు : వైకోమ్ భాసి
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : సమీరా సనీష్
ఉత్తమ మేకప్ ఆర్టిస్టు : రోనెక్స్ జేవియర్
స్పెషల్ జ్యూరీ అవార్డు (చిత్రం) : పారడైజ్
స్పెషల్ జ్యూరీ అవార్డులు (నటులు) : ఆసిఫ్ అలీ, టోవినో థామస్, దర్శన రాజేంద్రన్, జ్యోతిర్మయి
ఈసారి అవార్డుల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రానికి విభిన్న విభాగాల్లో పలు అవార్డులు దక్కడం గమనార్హం. కేరళ సినీ రంగంలో ప్రతిభకు గుర్తింపు దక్కిన ఈ వేడుక సినీ అభిమానులందరికీ పండుగ వాతావరణాన్ని సృష్టించింది.



