మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, టాక్ ఎంత హిట్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం దూసుకెళ్లడం లేదు. మొదటి రోజే రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, తర్వాతి రోజుల్లో వసూళ్లు క్రమంగా తగ్గుతూ వచ్చింది.
శనివారం రూ.7.1 కోట్లు, ఆదివారం రూ.6.9 కోట్లు, సోమవారం నాటికి రూ.2.5 కోట్లకే పరిమితమవ్వడంతో ట్రేడ్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. మొత్తం మీద నాలుగు రోజుల ఇండియా కలెక్షన్లు రూ.25.9 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తము రూ.31.5 కోట్లుగా నమోదైంది.
ఈ చిత్రానికి తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ, క్లైమాక్స్‌లో మంచు విష్ణు నటనను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. కానీ ఈ పాజిటివ్ రెస్పాన్స్‌ను కలెక్షన్ల రూపంలో మార్చడంలో సినిమా వెనకబడినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ లాంటి స్టార్ కమెయో ఉన్నా, సినిమాకు వచ్చిన వసూళ్లు ఆశించిన స్థాయికి చేరలేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా తమిళం, మలయాళం, కన్నడ మార్కెట్లలో ఈ చిత్రం చాలా తక్కువ కలెక్షన్లనే రాబట్టింది.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కన్నప్ప’ మూవీ కనీసం రూ.180 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సిన అవసరం ఉంది. కానీ మొదటి నాలుగు రోజుల్లో కేవలం రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లతోనే పరిమితమవడంతో థియేటర్ బిజినెస్ నుంచి బడ్జెట్‌లో సగం కూడా తిరిగి వస్తుందా? అన్న ప్రశ్నలు కొనసాగుతున్నాయి.
అంతేకాకుండా, పైరసీ కూడా ఈ సినిమాకు మరో సమస్యగా మారింది. ఇప్పటికే 30,000 పైరసీ లింకులు తొలగించినట్టు మంచు విష్ణు తెలిపారు. పైరసీ డిజిటల్ దొంగతనం అని, ప్రేక్షకులు దీన్ని ప్రోత్సహించవద్దని ఆయన కోరారు.
రానున్న రోజుల్లో ‘కన్నప్ప’ తాను ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి. హిట్ టాక్‌కి తగిన వసూళ్లు రానిదంటే, ఇది టాలీవుడ్‌లో మరో కీలక గమనికగా మిగిలిపోవచ్చు.