జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి:APUWJ మంగళగిరి శాఖ జర్నలిస్టులు.

journalistulu-samasyaalu-apuwj-demand-in-mangalagiri

మంగళగిరి-తాడేపల్లి; జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) మంగళగిరి శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు.జర్నలిస్టుల కోరికల దినాన్ని పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ,మంగళవారం వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తొలుత మంగళగిరి అంబేద్కర్ సెంటర్ నుండి ప్రదర్శనగా మంగళగిరి తహసిల్దార్ కార్యాలయాని కి చేరుకున్నారు.డిప్యూటీ తహసిల్దార్ అంకారావుకు వినతి పత్రాన అందజేశారు.తాడేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సీతారామయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ,ఇకపై పాత అక్రిడేషన్ల గడువును పొడిగించకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు.రాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరడం జరిగింది.జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాత్రికేయుల పింఛన్ పథకాన్ని ఏపీ లోనూ అమలు చేయాలని కోరారు.వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడంతోపాటు స్కీం అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఒక తైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని నియమించాలని కోరారు.


ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మంగళగిరి నియోజకవర్గ శాఖ అధ్యక్షులు జొన్న వెంకటేష్,కార్యదర్శి బత్తుల సాంబశివరావు (సాంబ)ఉపాధ్యక్షులు షేక్ సుభాని, సహాయ కార్యదర్శి మెడకాయల మస్తాన్ రావు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు,సింహాద్రి శ్రీనివాసరెడ్డి,జిల్లా యూనియన్ నాయకులు కొండా అభిరామ్ కృష్ణారెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రెటరీ కటికల కమల్, కార్యవర్గ సభ్యులు చదలవాడ సాయి చంద్, రాయపూడి చిన్నబాబు, సందీప్, ప్రదీప్, యూనియన్ నాయకులు టి.రాంబాబు, వేముల రాంబాబు, గండికోట దుర్గారావు,పల్లి ప్రకాష్ బాబు,గాజుల సురేష్, ఇంధనం నాగరాజు జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం ఆరేపల్లి రాజు,అన్వర్ ఖాన్, సిరిబాబు,గండికోట సాయి,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి