ప్రశ్నించే గొంతుకనై చెబుతున్నా…
నిలువెత్తు ఆయుధంలా… మన’కలం’కనిపించాలంటే అక్షరాన్ని నమ్ముకో…
ప్రశ్నించే గొంతుకనై మళ్ళీ చెబుతున్నా…
నిండైన జ్ఞానిలా మారాలి అంటే అక్షరాన్ని నమ్ముకో….
ప్రశ్నించే గొంతుకనై మరోసారి చెబుతున్నా….
ఈ సమాజాన్ని సత్కరించాలి అంటే అక్షరాన్ని నమ్ముకో….
ప్రశ్నించే గొంతుకనై ఇంకోసారి చెబుతున్నా…..
నీకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలి అంటే, అక్షారాన్ని నమ్ముకో….
ప్రశ్నించే గొంతుకనై పదే పదే చెబుతున్నా….
విప్లవాన్ని సృష్టించాలి అంటే అక్షరాన్ని నమ్ముకో…
ప్రశ్నించే గొంతుకనై ఇలానే చెబుతున్నా….
ఈ సమాజం అండాసెల్లో చిక్కుకుంది,దానిని వెలుగులోకి తేవాలి అంటే అక్షరాన్ని నమ్ముకో….
ప్రశ్నించే గొంతుకనై ఎవరు వద్దన్నా,చెబుతున్నా….
అవినీతి,అక్రమాలపై పోరాడేతత్వం కోసం అక్షరాన్ని నమ్ముకో…..
ప్రశ్నించే గొంతుకనై ఇంకా చెబుతున్నా…
ఏ మూర్ఖపు,అంధకార, ఆధిపత్య శక్తులైనా నిజం చెప్పాల్సిన జర్నలిజం గొంతు నులిమినా అక్షరమే నిజం.
ప్రశ్నించే గొంతుకనై మళ్ళీ మళ్ళీ చెబుతున్నా….
నా మరణ వాంగ్మూలంలా చెబుతున్నా…..
జర్నలిజం ఎప్పటికి నిజమే చెప్పాలి…అదే జర్నలిజం. అందుకే అక్షరాన్ని నమ్ముకుందాం…
ప్రశ్నించే గొంతుకగానే చెబుతున్నా….
కొందరు బానిసత్వపు జర్నలిస్టున్న చోట…
పట్టులేని అక్షరాలు ప్రజాస్వామ్యపు పెచ్చులు రాలుస్తున్నాయి.



