పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్న అనేక మంది పన్నుదాతలు తగిన సమాచారం లేకపోవడంతో అందుబాటులో ఉన్న మినహాయింపులను వదులుకుంటున్నారు. నిపుణుల ప్రకారం, సరైన డాక్యుమెంట్లు కలిగి ఉండటం, మరియు క్లెయిమ్ చేసే వివరాలను ITRలో సరిగ్గా పొందుపరచడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఇటీవల ITR దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. ఈ సందర్భంగా పాత విధానంలో మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే కీలక అంశాలపై ఓసారి దృష్టి పెడదాం.
ముఖ్యమైన మినహాయింపులు & సెక్షన్లు:
1. ఆరోగ్య బీమా ప్రీమియం – సెక్షన్ 80D
- 60 ఏళ్లలోపు: ₹25,000 వరకు
- తల్లిదండ్రులకు అదనంగా ₹25,000 (60 కంటే తక్కువ వయసు), లేదా ₹50,000 (60 కంటే ఎక్కువ)
- ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ ఖర్చులకు ₹5,000 వరకు
- బీమా లేని సీనియర్ సిటిజన్ల మెడికల్ ఖర్చులకు ₹50,000 వరకు
2. ఉద్యోగి భవిష్య నిధి (EPF, VPF)
- రూ.1.5 లక్షల వరకు మినహాయింపు అందుబాటులో ఉంది (80C కింద)
- రూ.2.5 లక్షల కంటే ఎక్కువ కంట్రిబ్యూషన్‌పై వడ్డీ పన్ను పబడుతుంది (2021-22 నుండి)
- కంపెనీ EPF + NPS + సూపరాన్యుయేషన్ కలిపి రూ.7.5 లక్షల కంటే ఎక్కువైతే అదనపు వడ్డీ పన్నుకి లోబడి ఉంటుంది
3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) – సెక్షన్ 80C
- రూ.1.5 లక్షల వరకు మినహాయింపు
- వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ ఫ్రీ
- 15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్
4. ELSS మ్యూచువల్ ఫండ్స్ – సెక్షన్ 80C
- రూ.1.5 లక్షల వరకు మినహాయింపు
- 3 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ గల ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్
5. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ – సెక్షన్ 80TTA, 80TTB
- 60 ఏళ్ల లోపు: ₹10,000 వరకు (80TTA)
- సీనియర్ సిటిజన్స్: ₹50,000 వరకు (80TTB)
- ఒకే సంవత్సరం 80TTA లేదా 80TTBలో ఒకదానిని మాత్రమే క్లెయిమ్ చేయాలి
6. హోం లోన్ మినహాయింపులు
- వడ్డీ చెల్లింపులపై – సెక్షన్ 24(b): ₹2 లక్షల వరకు
- ప్రిన్సిపల్ చెల్లింపులపై – సెక్షన్ 80C: ₹1.5 లక్షల వరకు
మినహాయింపులు ఎవరు క్లెయిమ్ చేయగలరు?
- మీ సొంత ఆదాయంతో చేసిన పెట్టుబడులకే మినహాయింపు వర్తిస్తుంది
- భార్య లేదా పిల్లల పేరుతో పెట్టుబడులు చేస్తే, మినహాయింపు క్లెయిమ్ చేయలేరు
- ఉమ్మడి హోం లోన్ లేదా పాలసీ ఉంటే, ఇద్దరూ తమ వాటా మేరకు మినహాయింపు పొందవచ్చు
క్లెయిమ్ చేసేందుకు సూచనలు:
- అన్ని బిల్లులు, రసీదులు భద్రంగా ఉంచాలి
- ITR ఫారంలో వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి
- మర్చిపోయిన మినహాయింపులను తదుపరి సంవత్సరాల్లో క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు