ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో మోసపోయిన వివాహిత | ఏపీలో షాకింగ్ ఘటన

సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి ప్రమాద సంకేతాలు మోగిస్తున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కొందరు అనైతిక సంబంధాలు, అసాంఘిక కార్యకలాపాలకు సోషల్ మీడియాను మాధ్యమంగా మార్చుకుంటున్నారు.

తాజాగా ఓ సోషల్ మీడియా పరిచయం ఓ వివాహిత జీవితాన్నే తారుమారు చేసింది. పెళ్లై, ముగ్గురు పిల్లలున్న ఆమె సోషల్ మీడియా మాయలో పడి దారి తప్పింది. ఏపీలో పరిచయమైన వ్యక్తిని పూర్తిగా నమ్మి అతని ప్రేమలో మునిగిపోయింది. కానీ ఆ నమ్మకమే చివరకు చేదు అనుభవానికి దారి తీసింది.

వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన 30 ఏళ్ల వివాహితకు Instagramలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ గంటల తరబడి చాటింగ్ చేస్తూ దగ్గరయ్యారు. ఆపై ఆడియో, వీడియో కాల్స్ కూడా కొనసాగాయి. తనను ధనవంతుడిగా, అనుభవం ఉన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న అతడి మాటలను ఆమె నమ్మేసింది. భర్తను, ముగ్గురు చిన్నారులను వదిలి అతడితో కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఆమె ఏపీకి చేరుకుని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆన్‌లైన్ ప్రియుడిని కలుసుకుంది. కానీ అక్కడే అసలు నిజం బయటపడింది. తాను ధనవంతుడినని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తాను మోసపోయానని గ్రహించి తీవ్ర నిరాశలో పడింది. ఈలోగా కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్‌లు, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించి పోలీసుల సహాయంతో ఆమెను సురక్షితంగా తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పడంతో చివరకు ఆమె తిరిగి తన కుటుంబం వద్దకే చేరింది.

ఈ ఘటనలో మరో విశేషం ఏమిటంటే—భార్య దారి తప్పినప్పటికీ భర్త పెద్ద మనసుతో ఆమెను తిరిగి స్వీకరించేందుకు అంగీకరించాడు. కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆమెకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది. అదే సమయంలో ప్రమాదకర పరిచయాలకు కూడా దారి తీస్తుంది. అందుకే సోషల్ మీడియాలో పరిచయాల విషయంలో అప్రమత్తత చాలా అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి