ఇండియన్ నేవీలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ – జనవరి 2027 కోర్సులో ప్రవేశాలకు ఇండియన్ నేవీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ కోర్సుకు సంబంధించిన శిక్షణ 2027 జనవరి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 260 SSC ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్
- జనరల్ సర్వీస్ (X) / హైడ్రో కేడర్: 76 పోస్టులు
- పైలట్: 25 పోస్టులు
- నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (ఆబ్జర్వర్స్): 20 పోస్టులు
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 18 పోస్టులు
- లాజిస్టిక్స్: 10 పోస్టులు
- ఎడ్యుకేషన్: 7 పోస్టులు
ఇంజినీరింగ్ బ్రాంచ్
- జనరల్ సర్వీస్: 42 పోస్టులు
- సబ్‌మరైన్ టెక్ ఇంజినీరింగ్: 8 పోస్టులు
ఎలక్ట్రికల్ బ్రాంచ్
- జనరల్ సర్వీస్: 38 పోస్టులు
- సబ్‌మరైన్ టెక్ ఎలక్ట్రికల్: 8 పోస్టులు
అర్హతలు
పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో
B.Sc, B.Com, BE, B.Tech, ME, M.Tech, MBA, MCA, PG, PG Diploma లేదా సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా వయోపరిమితి, శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం
ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు.
క్రింది దశల ఆధారంగా ఎంపిక ఉంటుంది:
- విద్యార్హతల మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
- SSB ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
శిక్షణ & వేతనం
ఎంపికైన అభ్యర్థులకు కేరళ రాష్ట్రంలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీ (INA)లో శిక్షణ అందిస్తారు. శిక్షణ అనంతరం విధులు కేటాయిస్తారు.
ప్రారంభ వేతనం నెలకు సుమారు రూ.1,25,000 ఉంటుంది. అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.



