భార్యా బాధితుల భర్తల విషయంలో భారత్ 3వ స్థానంలోకి…!

భార్యా భర్తల బంధం చాలా విలువైనది.చాలా బలమైనది కూడా.పొద్దున నిద్దుర లేసింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ బంధం ముందు వెనుక ఎన్ని సమస్యలు ఉన్నా ఆ బంధం ఎప్పటికి ఒకేలా ఉంటుంది.ఒక్కో సమయంలో “రెండు కత్తులు ఒకే వరలో ఇమడలేవు” అనిపిస్తుంది. కానీ ఏం జరిగినా ఈ భార్యాభర్తల బంధానికి ఈ సామెత అస్సలు వర్తించదు.కారణం వ్యక్తులు ఇద్దరూ వేరైనా…వారి భంధం అనేది ఎవరూ విడదీయరానిదిగా ఉంటుంది.చివరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, మొగుడు పెళ్ళాలు వాళ్ళ గొడవ మాకెందుకు అని తప్పుకు వెళ్లేవారు ఉన్నారు.అసలు భార్యాభర్తలు అంటేనే ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేవారు.ఈ బంధంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు.కానీ నేను గొప్ప, కాదు కాదు నేను గొప్ప అనుకుని ప్రతీ దానికి పెత్తనాలు చేస్తూ పరస్పరం ఒకరినొకరు దూషించుకుని,కొట్టుకుని మరలా ఒక్కటై కలిసిపోవడం ఈ భార్యాభర్తల సంభందానికే సాధ్యం.సరిగ్గా ఇక్కడ ఓ చిన్న సమస్య కూడా ఉంది.ఒకరికి ఒకరు పరస్పర బాధితులు కూడా.ఇలా తమ మనసులో ఉన్న బాధలు ఎవరికి చెప్పుకోలేనివారు ఉన్నారు.భర్త బాధలు భరాయించే ఓపిక లేని కొంతమంది భార్యలు గృహహిం*స చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది భార్యలచే వేదిం*చబడుతున్న భర్తలకు మార్గం ఉందా అంటే…అది భార్యా బాధి తుల సంఘాలలో చేరిపోవడమే అనుకోవచ్చు.

ఇకపోతే కొన్ని నివేదికల ప్రకారం ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలు గృహ హింస ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.అంటే ముఖ్యంగా భర్తలు భార్య బాధితులుగా మారుతున్నారు.పలు దేశాలలో భార్యలు పెట్టే బాధలు భరించే స్థితిలో లేని భర్తలు బాధలు ఇప్పుడు బాగా పెరిగాయని తెలుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భార్యలు తమ భర్తలను కొట్టే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయట…!ఈ గణాంకాల జాబితాలో మన భారతదేశం మూడవ స్థానంలో ఉందనేది సమాచారం.ఇక ఐక్యరాజ్యసమితి నే-ర గణాంకాలకొస్తే ఈజిప్టులో భర్తలు గృహ హింసను ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆ దేశ ఫ్యామిలీ కోర్టు ప్రకారం గృహహింస బాధితులైనటువంటి భర్తలలో 66 శాతం మంది విడాకులకు దరఖాస్తులు చేసుకున్నారట…!ఈ జాబితాలో యునైటెడ్ కింగ్‌డమ్(యు.కే) రెండవ స్థానంలో ఉండగా భారతదేశం మూడవ స్థానంలో ఉంది. సాంప్రదాయాలకు పుట్టిన ఇల్లు అయిన భారతదేశంలో కూడా ఈ సంఖ్య పెరుగుతూ మన దేశ సమాజం ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది.అయితే మన దేశంలోని వాస్తవమైన పరిస్థితి చెప్పాలంటే చాలా మంది పురుషులు తమ ఇంట్లో కొంతమంది భార్యలు పెడుతున్న హిం*సని ..వారు పెడుతున్న కష్టాలను/ఇబ్బందులను చాలా నిశ్శబ్దంగా భరిస్తున్నారట…!

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి