అమెజాన్ అడవిలో….. అత్యంత ప్రమాదకరమైన జీవులు…!!

మెజాన్ అడవి ఈ భూ గ్రహంపై అత్యంత ఆకర్షణీయమైన పర్యావరణ ప్రదేశాలలో ఒకటి.ఇక ఇదే అమెజాన్ అడవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనం ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది.అమెజాన్ అడవి ప్రపంచం లోనే అతి పెద్ద ఉష్ణమండల వర్షారణ్యం కలిగినది.ఇది దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాలలో 5.5 మిలియన్ చదరపు కిలో మీటర్లు అనగా 2.1మిలియన్ చదరపు మైళ్ళు విస్తరించి ఉన్న అడవి.అమెజాన్ అడవి వేలాది పక్షులు, క్షీరదాలు,సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలతో సహాపలు వృక్ష మరియు జంతు జాతుల వరకు నివాస ప్రాంతంగా ఉంది.అలాగే ఎనిమిది దేశాలలో ఈ అడవి విస్తరించి ఉంది.ఆయా దేశాల వన్య ప్రాణులు విషయానికి వస్తే,అమె జాన్ అడవిలో జాగ్వార్‌ లు,మకావ్‌లు మరియు అనకొండలు వంటి అనేక రకాల భ*యంకరమైన జంతు,కీటక జాతులకు ఈ అడవి ఒక ఒక సురక్షిత నిలయంగా ఉంది.

ఇప్పుడు ఈ అమెజాన్ అడవిలో కనిపించే,నివసించే “బుల్లెట్ చీమ”(పారాపోనెరా క్లావాటా)గురించి కొన్ని విషయాలు,ఈ “బుల్లెట్” చీమల గురించి,ఒక భయంకరమైన జలచరం ఐన “ఎలక్ట్రిక్ ఈల్” వంటివాటి గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం . బుల్లెట్ చీమలు అనేవి కుడితే చాలా బాధగా ఉంటుంది. ఆ నొప్పి భరించలేనంత భాద, తీవ్రమైన నొప్పి, మంట అలాగే జ్వరం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.దీని విషంలో పోనెరా టాక్సిన్ అనే సమ్మేళనం వుంటుందని దీని కారణంగానే అంతటి నొప్పి,మంట, బాధ కలుగుతుందని చెబుతారు.చీమ జాతుల్లో నే ఇవి అతిపెద్ద చీమల జాతి.బుల్లెట్ చీమలు ప్రపంచంలోనే వీటికి ఓ ప్రత్యేకత ఉంది.ఈబుల్లెట్ చీమలు 2.5 సెం.మీ,అన గా ఒక అంగుళం వరకు పొడవు కలిగి ఉంటాయి. అలాగే మనకు ఇళ్ళల్లో కనిపించే ఎర్ర చీమలు ఎలా ఉంటాయో….!అదే రకంగా ఎర్రగా అంగుళం పొడవు ఉంటుంది.మరి ఆ చీమ కుడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహిస్తే ఎవరై నా వామ్మో…!!అనడం తప్ప చేసేది ఏమీ లేదన్నమాట.నల్ల చీమలు కుడి తేనే బాధగా ఉంటుంది.చిన్నసైజుఎర్రసీమ(కరెంట్ చీమ)కన్నా,అంగుళం సైజు ఎర్రచీమ కుడితే ఇక అంతే సంగతులు.మనిషి నాడీ వ్యవస్థకు ఇబ్బంది.అలాగే బుల్లెట్ చీమలు అమెజాన్ పర్యావరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఇతర జంతు వులకు,అక్కడ వేటగాళ్ళకి ఆహారంగా కూడా ఉప యోగ పడతాయట.

విద్యుత్ ‘షాక్’ ఇచ్చే ఎలక్ట్రిక్ ఈల్స్.

ఇక మరో ప్రమాదకరమైనది ఎలక్ట్రిక్ ఈల్.ఈ ఎలక్ట్రిక్ ఈల్స్ అనేవి జలచరాలు. ముఖ్యంగా ఇదో రకమైన చేప.ఇది జిమ్నో టిడే జాతికి చెందిన ప్రత్యేక మైన చేప.ఇది కూడా దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల్లో గల నదిలో నియోట్రోపికల్ మంచినీటి చేపల జాతికి చెందిన ఎలక్ట్రోఫోరస్,వీటిలో ఇవి ఎలక్ట్రోఫోరినే అనే ఉప జలచరాల చేప జాతిలో గల ఒకే ఒకరకం.చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది తన శరీరం నుండి 860 వాల్ట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు.ఇది తనలోని విద్యుత్ షాక్‌ లను అందించడం ద్వారా దానిని వేటాడి పట్టుకోవాలనుకునే వారి నుండి, ఇతర ప్రమాదాల నుండి రక్షణ పొందే సామర్థ్యం చెంది ఉంటాయి.వాటి విద్యుత్ సామర్థ్యాలను మొదట 1775లో అధ్యయనం చేశారు.ఇది 1800 సం.లో ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆవిష్కరణకు దోహదపడింది.ఎలక్ట్రిక్ ఈల్స్ 2.5 మీటర్లు (8.2 అడుగులు) పొడవు వరకు పెరుగుతాయి మరియు 20 కిలోగ్రాముల (44 పౌండ్లు) వరకు బరువు ఉంటాయి.ఇవి చిన్న చిన్న జంతువులను సైతం వేటాడి తింటాయి.అలాగే ఈ ఎలక్ట్రిక్ ఈల్స్ ‘షాక్’ గిలితే మనిషి ప్రాణాలకు ముప్పు తప్పనిసరి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి