మధ్యప్రదేశ్‌లోని హర్డా నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన మితాలి అగర్వాల్ (కావ్య) ప్రతిష్ఠాత్మక Mrs India 2025 పోటీల్లో సత్తా చాటారు. రాజస్థాన్ జైపూర్‌లోని జైబాగ్ ప్యాలెస్‌లో డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరిగిన ఈ పేజెంట్‌లో ఆమె ‘మిసెస్ ఇండియా 2025 – గ్లోబల్ అంబాసిడర్’, ‘మిసెస్ ఇండియా కాంజెనియాలిటీ 2025’ అనే రెండు ముఖ్యమైన టైటిల్స్‌ను సొంతం చేసుకుని హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలిచారు.
దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతమైన మహిళల మధ్య జరిగిన పోటీలో మితాలి సేవా భావన, సహృదయత, నాయకత్వ లక్షణాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇంజనీరింగ్ చదివిన ఆమె కమ్యూనికేషన్ రంగంలో కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం కమ్యూనికేషన్ లీడర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మితాలి స్థాపించిన EcoMiTz అనే purpose-driven ప్లాట్‌ఫామ్ ద్వారా Individual Social Responsibility (ISR) భావనను ప్రోత్సహిస్తున్నారు. అలాగే Padcare సంస్థతో కలిసి Red Revolution కార్యక్రమాన్ని ప్రారంభించి, మెన్స్ట్రువల్ వ్యర్థాల రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణ, మహిళల గౌరవ పరిరక్షణపై కృషి చేస్తున్నారు.
తన విజయానికి కుటుంబం ఇచ్చిన అండే కారణమని మితాలి తెలిపారు. Mrs India వేదిక తనకు మార్పు తీసుకొచ్చే చేంజ్‌మేకర్‌గా నిలబడే అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు.
“Beauty = Purpose, Purpose = Power” అనే సందేశంతో అందం అనేది రూపంలో కాదు, సమాజానికి చేసే సేవలో ఉందని ఆమె మరోసారి నిరూపించారు.



