డిలీట్ అయిన SMSల‌ను తిరిగి పొందడం ఎలా? గూగుల్, సామ్‌సంగ్ యూజర్లకు సింపుల్ టిప్స్

how-to-recover-deleted-sms-on-android

వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్‌లు ఎంతగా వాడుతున్నా.. ఇంకా చాలా మంది బ్యాంకింగ్ లావాదేవీలు, OTPలు, పేమెంట్ కన్ఫర్మేషన్లు వంటి కీలక సమాచారం కోసం SMSలపైనే ఆధారపడుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఓ ముఖ్యమైన మెసేజ్ డిలీట్ అయితే..? ఆ మెసేజ్ అత్యవసరమైనదైతే ఏం చేయాలి? చాలామందికి తెలియక నిరాశతో మానిపోతుంటారు. కానీ, అసలు ఆవసరమే లేదు. కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే ఆ SMSను తిరిగి పొందొచ్చు.


1. Google Messages యాప్‌లో Archive మెసేజ్‌లను రికవర్ చేయడం ఎలా?

చాలాసార్లు మనం మెసేజ్‌ను డిలీట్ చేశామనుకుంటే అది Archive అయిన ఉంటుంది. ఆ మెసేజ్‌లు పూర్తిగా పోకపోవచ్చు.

దీనికోసం:

  • Google Messages యాప్ ఓపెన్ చేయండి
  • టాప్‌లో ప్రొఫైల్ ఐకాన్ (3 lines) క్లిక్ చేయండి
  • “Archived” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
  • అవసరమైన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి “Unarchive” పై టాప్ చేయండి
  • ఆ మెసేజ్ తిరిగి Inboxలోకి వస్తుంది

2. Spam ఫోల్డర్‌ని చెక్ చేయండి

కొన్నిసార్లు OTPలు, బ్యాంక్ మెసేజ్‌లు తప్పుదోవ పట్టి Spam ఫోల్డర్‌కు వెళ్లిపోతుంటాయి.

దీన్ని ఎలా చూడాలి:

  • Google Messages యాప్ ఓపెన్ చేసి
  • మెనూ నుంచి “Spam & blocked” సెలెక్ట్ చేయండి
  • అవసరమైన మెసేజ్ ఉంటే “Not spam” చేయండి
  • ఆ మెసేజ్ తిరిగి ప్రధాన ఇన్‌బాక్స్‌కు వస్తుంది

3. Samsung యూజర్లకు Recycle Bin ఫీచర్ – అదృష్టం

Samsung ఫోన్లలోని Messages యాప్‌లో Recycle Bin ఫీచర్ ఉంటుంది. ఇందులో 30 రోజుల లోపు డిలీట్ చేసిన మెసేజ్‌లు ఉంటాయి.

చేయాల్సింది:

  • Samsung Messages యాప్ ఓపెన్ చేయండి
  • టాప్ రైట్‌లోని మెనూ (3 డాట్స్) పై టాప్ చేయండి
  • “Recycle Bin” సెలెక్ట్ చేయండి
  • డిలీట్ అయిన మెసేజ్ ఉంటే సెలెక్ట్ చేసి “Restore” చేయండి

4. Third-Party Apps – ముందే బ్యాకప్ ఉంటేనే ఉపయోగపడతాయి

SMS Backup & Restore వంటి యాప్‌లు ఉపయోగించి కూడా మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. కానీ ఇవి ఫలితమివ్వాలంటే మీరు బ్యాకప్ తీసి ఉంచివుండాలి.

  • SMS Backup & Restore Appను Play Store నుండి డౌన్‌లోడ్ చేయాలి
  • డేటా బ్యాకప్ ఉంటే పాత మెసేజ్‌లు తిరిగి పొందొచ్చు
  • బ్యాకప్ లేకపోతే పని చేయదు

ముఖ్య సూచన:

  • ముఖ్యమైన మెసేజ్‌లు ఉంటే Google Drive లేదా Samsung Cloudలో SMS Backup ఎంచుకోవడం అలవాటు చేసుకోండి
  • ఫోన్ మార్చే ముందు లేదా Factory Reset చేసేముందు SMS Backup తప్పనిసరిగా తీసుకోండి

ముగింపు:

ఒకవేళ SMS డిలీట్ అయిందంటే అంతే గాని తిరిగి పొందలేము అనే భావన తప్పు. Google Messages, Samsung Messages వంటి యాప్‌లలో ఉన్న Archive, Spam, Recycle Bin వంటి ఫీచర్లను తెలివిగా వాడుకుంటే, చాలా తేలికగా మీ మెసేజ్‌లు తిరిగి పొందవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, చిన్న చిన్న సమస్యలే కాదు.. ముఖ్యమైన సమాచారం కూడా చేజారకుండా రికవర్ చేయొచ్చు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి