హై బ్లడ్ ప్రెజర్‌ని నేచురల్‌గా కంట్రోల్ చేసే ఆహారాలు

health/natural-foods-to-control-high-blood-pressure

హైబీపీ లేదా హైపర్‌టెన్షన్‌ను “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే సరైన డైట్‌తో పాటు కొన్ని నేచురల్ ఫుడ్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సౌరభ్ సేథి సూచించిన కొన్ని ఫుడ్స్ ఇవి:

1. అల్లం

మన వంటగదిలో తరచుగా ఉండే అల్లం రక్తనాళాలను సడలించి, రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సహజంగా బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లాన్ని కూరల్లో, టీ లో, స్మూతీల్లో వాడుకోవచ్చు. అయితే అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు కాబట్టి మితంగా వాడటం మంచిది.

2. దానిమ్మ

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. రీసెర్చ్ ప్రకారం, దానిమ్మరసం తీసుకోవడం వలన సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీ రెండూ తగ్గుతాయి. కాబట్టి దానిమ్మ పండ్లు లేదా రసం రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

3. బీట్‌రూట్

బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్స్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను విస్తరింపజేస్తాయి. దీని వలన రక్తప్రవాహం మెరుగుపడి బీపీ తగ్గుతుంది. దీన్ని సలాడ్స్, జ్యూస్, స్మూతీస్ రూపంలో లేదా బీట్‌రూట్ పౌడర్‌గా కూడా తీసుకోవచ్చు.

4. అరటిపండు

అరటిపండ్లు పొటాషియం పుష్కలంగా కలిగి ఉంటాయి. పొటాషియం శరీరంలో అధిక సోడియాన్ని బయటకు పంపి బీపీని నియంత్రిస్తుంది. అందువల్ల అరటిపండ్లను డైట్‌లో చేర్చడం హైబీపీ రోగులకు ఉపయోగకరం.

5. డార్క్ చాక్లెట్

70% కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం, ఫ్లేవనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి బీపీ తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఇది మితంగా మాత్రమే తినాలి.


ముఖ్య గమనిక

ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఈ ఆహారాలను తీసుకోవాలా లేదా అన్నది డాక్టర్‌ని సంప్రదించడం తప్పనిసరి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి