షుగర్ కంట్రోల్ చేయాలంటే బాదం ఆకులు.. మధుమేహానికి సహజ పరిష్కారం

నేటి కాలంలో షుగర్ (డయాబెటిస్) ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ఇది ప్రభావితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో డయాబెటిస్ రోగులు ఉన్న దేశాల్లో భారత్ ముందువరుసలో ఉంది. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే, దాన్ని పూర్తిగా నయం చేసే మందు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. అయితే సరైన జీవనశైలి, ఆహార నియంత్రణ, వైద్య సూచనలతో దీన్ని అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యమే.

ఒకప్పుడు మధుమేహం అనేది వంశపారంపర్యంగా మాత్రమే వచ్చే వ్యాధిగా భావించేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జన్యుపరమైన కారణాలతో పాటు మారిన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ వినియోగం, శారీరక శ్రమ లోపం, అధిక ఒత్తిడి, ఊబకాయం వంటి అంశాలు డయాబెటిస్‌కు ప్రధాన కారణాలుగా మారాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది.

మందులతో పాటు ప్రకృతి మనకు అందించిన కొన్ని ఔషధ మొక్కలు, ఆకులు కూడా షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బాదం ఆకులు – మధుమేహానికి సహజ పరిష్కారం

సాధారణంగా బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అయితే బాదం చెట్టు ఆకుల్లో కూడా షుగర్‌ను నియంత్రించే అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం బాదం ఆకుల్లో జాంబోలిన్, జాంబోసిన్ వంటి సహజ పదార్థాలు ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థం వేగంగా చక్కెరగా మారకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.

వాడుకునే విధానం

కషాయం రూపంలో:
బాదం ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని టీలా తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

పొడి రూపంలో:
బాదం ఆకులను నీడలో ఎండబెట్టి మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు ఒకసారి గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల షుగర్ నియంత్రణకు సహకరిస్తుంది.

లేత ఆకులు:
ముదురు రంగు ఆకుల కంటే లేత రంగులో ఉన్న ఆకులను నమిలి తినడం లేదా వాటి రసం తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

బాదం ఆకులు కేవలం మధుమేహానికే కాదు, రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి.
అలాగే నోటి దుర్వాసనతో బాధపడేవారు బాదం ఆకులను నమిలితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ప్రకృతి మనకు అందించిన మరికొన్ని ఆకులు కూడా షుగర్ నియంత్రణలో సహాయపడతాయి.

మామిడి ఆకులు:
వీటిలో ఉండే ఆంథోసైనిడిన్లు, టానిన్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఉపయోగపడతాయి.

వేప ఆకులు:
వేప ఆకుల రసం తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడి ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా పనిచేస్తుంది.

కరివేపాకు:
సాధారణంగా కూరల్లో వాడే కరివేపాకును నమిలి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Disclaimer:
ఈ ఆర్టికల్‌లో అందించిన సమాచారం సాధారణ అవగాహన మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోండి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి