పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం CBSE విద్య: హీల్ ప్యారడైజ్ స్కూల్

చిన్న వయసులోనే తల్లిదండ్రులను పూర్తిగా లేదా ఒకరిని కోల్పోయి, సరైన ఆదరణ లేక చదువును మధ్యలోనే ఆపేసే పిల్లలు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడుల కారణంగా చదువుకు దూరమవుతున్న ఈ పేద పిల్లలు విద్యావకాశాలు కోల్పోకుండా ముందుకు సాగాలనే గొప్ప సంకల్పంతో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్‌ స్థాపించిన విద్యాసంస్థే ‘హీల్ ప్యారడైజ్’.

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో, సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో ఈ విశాలమైన క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు పూర్తిగా ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులతో, సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తున్నారు. చదువుతో పాటు వసతి, రుచికరమైన భోజనం కూడా విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు. ఈ స్కూల్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హీల్ ప్యారడైజ్ విద్యాసంస్థలో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో కూడిన హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థులకు అందించే భోజనంలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే ఉపయోగిస్తారు. సోలార్‌ వంటగది ద్వారా భోజనం సిద్ధం చేస్తారు. తాగడానికి ఆర్వో ద్వారా శుద్ధి చేసిన నీరు, వేడినీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. క్రీడలకు ప్రత్యేక సదుపాయాలు, ఇండోర్ స్టేడియం కూడా ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు.

ఇన్నోవేషన్ & ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎక్స్‌లెన్స్ సెంటర్, సైబర్ సెక్యూరిటీ సెంటర్, 3డీ ప్రింటింగ్, డిజైన్ థింకింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా ఈ క్యాంపస్‌లో ఉన్నాయి. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకునేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ స్కూల్‌లో చదివిన విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యలు అభ్యసించేందుకు హీల్ సంస్థ సహకారం అందిస్తుంది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఒక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. అత్యుత్తమ అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు, అంతర్జాతీయ స్థాయి ఫ్యాకల్టీ ద్వారా విద్యాబోధన జరుగుతుంది. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ స్కూల్‌లో చేరవచ్చు.

ఈ విద్యాసంస్థలో విశాలమైన లైబ్రరీ ఉంది. ఇందులో సుమారు 15 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తిని బట్టి కళలలో కూడా (3డీ డ్రాయింగ్, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం) ప్రోత్సాహం, శిక్షణ ఇస్తారు.

2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు: ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు, అలాగే ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా హీల్ అంధుల పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి.

1 నుంచి 9 తరగతులకు సంబంధించి తల్లిదండ్రులను పూర్తిగా లేదా ఒకరిని కోల్పోయి, ఆర్థికంగా వెనుకబడిన 6 నుంచి 15 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు అర్హులు. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. అంతేకాకుండా హీల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులవ్వాలి.

ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో చేరాలంటే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు పదో తరగతిలో కనీసం 480 మార్కులు (సీబీఎస్ఈ/ఐసీఎస్ఈలో 400కు పైగా మార్కులు) సాధించి ఉండాలి. వీరికి కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.

అంధుల పాఠశాలకు సంబంధించి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు, ఆర్థికంగా వెనుకబడినవారు మరియు కనీసం 40 శాతం కంటే ఎక్కువ అంధత్వ ధ్రువపత్రం ఉన్న విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2026 ఫిబ్రవరి 15.
మరిన్ని వివరాలకు 9100024438, 9100024435 నంబర్లను సంప్రదించవచ్చు.
వెబ్‌సైట్: www.healschool.org

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి