గతంలో న్యూస్ కవరేజ్ విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా స్ట్రింగర్స్ కి ఎన్నో ఇబ్బందులు ఉండేవి. అప్పట్లో సొంత డబ్బులతో హ్యాండీక్యామ్ కెమెరాలను కొనుగోలు చేసి స్ట్రింగర్స్ న్యూస్ కవరేజీ చేయడం జరిగింది.నాడు హ్యాండ్ క్యామ్స్ కొనుగోలు చేయాలి అంటే 20 వేల నుండి 50వేల రూపాయల లోపు ధర కలిగిన కెమెరా లు కొనుగోలు చేసి స్ట్రింగర్స్ న్యూస్ కవర్ చేసే వారు.చేతిలో అంత విలువైన కెమెరా ఉన్నప్పటికీ ఒక వార్త/వార్తా కథనానికి అవసరమైన వీడియో విజువల్స్,షాట్స్ పై స్ట్రింగర్స్ కి పెద్దగా అవగాహన ఉండేది కాదు. పోనీ ఆస్ట్రింగర్స్ ని అవసరం కొద్దీ వాడు కోవడం,విజువల్స్ షాట్స్ బాగోలేకపోతే ఇష్టాను సారంగా దూషించడం తప్ప కనీసం తమ సంస్థ తరుపున కొన్నిరోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించుదాం అనే ఆలోచన ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు అప్పుడు లేదు,ఇప్పుడూ లేదు.ఇక అప్పట్లో మొబైల్ ద్వారా షూట్ చేసిన విజువల్స్,షాట్స్ పంపిస్తే స్ట్రింగర్ పోస్ట్ నుండి క్షణాల్లో తొలగించడం జరిగేది.ఇక రాను రాను హ్యాoడీక్యామ్ కెమెరాల స్థానంలో మొబైల్ ఫోన్స్ వచ్చాయి.ఇప్పుడు వాటి ద్వారా తీసే విజువల్స్, షాట్స్ టీవీ న్యూస్ చానల్స్ కి మహా ప్రసాదం అయ్యాయి.మొబైల్స్ ద్వారా తీసే విజువల్స్ తోనే ఇప్పుడు యూ ట్యూబ్ చానల్స్ ప్రత్యేకమైన న్యూస్ చానల్స్ గా ఎదుగుతున్నాయి.అప్పట్లోఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ హోదా కావాలి అంటే చేతిలో హ్యాండీ క్యామ్ కెమెరా ఉండాల్సిం దే.లేనిపక్షంలో కెమెరా కొనుగోలు చేసిన సొంత కెమెరా కలిగిన వ్యక్తినే స్ట్రింగర్ గా ఎలక్ట్రానిక్ మీడియా చానల్స్ అవకాశం కల్పించేవి.
ప్రస్తుతం రిపోర్టర్లుగా కొనసాగుతున్న వ్యక్తులకు మీడియా విజువల్స్, కెమెరా షాట్స్ పై కొంత అవగాహన కోసం ఈ కథనం.మొబైల్ ఫోన్లు వచ్చాక వీడియో కెమెరా లు,హ్యాండీక్యామ్స్ వాడుక చాలా వరకు తగ్గి పోయింది.ఒకప్పుడు స్ట్రింగర్ గా పనిచేసే వారిని మొబైల్ ద్వారా విజువల్స్ షూట్ చేసి పంపిస్తే మీడి యా సంస్థలు ఏమాత్రం ఉపేక్షించేవి కావు.అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి అంటే తప్పనిసరిగా చేతిలో హ్యాండీక్యాము కెమెరా ఉండేది.హ్యాండీక్యాం కెమెరాలు ద్వారా విజువల్స్ తీసేందుకు నాటి స్ట్రింగర్స్ నాణ్యమైన విజువల్స్ కోసం చాలా కష్టపడేవారు.ఆ కెమెరా లను క్వాలిటీ విజువల్స్ కోసం కొంత మంది స్ట్రింగర్స్ మాన్యువల్ విధానాన్ని ఉపయోగిస్తే, కొంతమంది స్ట్రింగర్స్ ఆటో మోడ్ విధానాన్ని ఉపయో గించేవారు.ఇలా నాటి కెమెరాలను న్యూస్ కవరేజ్ కి ఉపయోగించేవారు. అలాగే హాండీ క్యామ్స్ వాడే స్ట్రింగర్స్ లో కొందరు రిపోర్టర్స్ కెమెరాలను వైట్ బ్యాలెన్స్ చేసుకోవటం, బ్యాక్ గ్రౌండ్ చూసుకోవటం,కవరు చేయబోయే న్యూస్ ఎన్ని రకాల ఫ్రెమ్స్ ద్వారా విజువల్స్ టేకింగ్ చేయాలి, కెమెరా అనుకూలత చూసుకోవడం,కలర్ బార్ చెక్ చేసుకోవటం,వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు లోగో ద్వారా వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవటం ఇలా పలు రకాలుగా ఇబ్బందులు ఉండేవి.కానీ ఇప్పుడు మొబైల్స్ రావడంతో కెమెరాలు వాడకం స్ట్రింగర్స్ లో నైతే బాగా తగ్గింది.చాలా వరకు ఇప్పుడు స్ట్రింగర్స్ సెల్ ఫోన్ల ద్వారానే వీడియోస్ తీయడం జరుగుతుంది. అయితే నాడు స్టింగర్స్ వాడిన హ్యాండికాం కెమెరా ల ద్వారా వారు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఈనాటి స్ట్రింగర్స్ కి లేవు. కాకపోతే న్యూస్ కి అవసరమైన వీడియో క్లిప్పింగ్స్,కెమెరా షాట్స్ ఎలా ఉండాలి,ఎలా ఉంటే న్యూస్ కి ఉపయోగపడతాయి అనే అంశాలు కొన్నిటిని తెలుసు కుందాం.
- (1)కెమెరా/మొబైల్ స్థిరంగా పట్టుకోవడం.
- (2)బ్యాక్ గ్రౌండ్ చూసుకోవటం.
- (3)కెమెరా/మొబైల్ పట్టుకునే విధానం.
- (4)వీడియో షాట్స్ -లైటింగ్.
- (5) పోర్ట్రైట్ విజువల్స్.
- (6) ల్యాండ్ స్కేప్ విజువల్స్.
- (7) టిల్ అప్ విజువల్స్.
- (8) టిల్ డౌన్ విజువల్స్.
- (9) లెఫ్ట్ టూ రైట్ పానింగ్.
- (10)రైట్ టు లెఫ్ట్ పానింగ్.
- (11)లాంగ్ షాట్.
- (12)మిడిల్ షాట్.
- (13)క్లోజ్ షాట్.
- (14) ఫుల్ ప్రేమ్.
- (15) బస్ట్ షాట్.
- (16) ఏరియల్ వ్యూ.
- (17) రన్నింగ్ షాట్స్.
- (18)విజువల్ టైమింగ్.
- (19)పర్ఫెక్ట్ ఫ్రేమ్.
- (20)కెమెరా మూమెంట్స్.
- (21) విజువల్ TCR.
- (22) క్లోజ్ అప్ షాట్.
- (23)గెయిన్ అప్ షాట్స్.
- (24)రిఫ్లెక్ట్ షాట్స్.
- (25)స్పెషల్ ఎఫెక్ట్స్.
కెమెరా షాట్స్ వాటి వివరణ.
1. కెమెరా/మొబైల్ స్థిరంగా పట్టుకోవడం
కెమెరా వాడేది ఎవరైనా కావచ్చు ఏదైనా సంఘటన,కార్యక్రమాలు, ఇతర వీడియో షాట్స్ కెమెరా/మొబైల్ లో రికార్డు చేసే వ్యక్తులు/జర్నలిస్టులు ప్రధానంగా తమచేతిలో ఉన్న కెమెరాని అటూ- ఇటూ కదల్చకుండా స్థిరంగా పట్టుకోవడం అనేది ఒక మంచి కెమెరా మెన్ లక్షణం.కెమెరా/మొబైల్ పట్ల జాగ్రత్త కలిగిన వ్యక్తులు చుట్టుపక్కల ఏమి జరుగుతుంది అనే ఆలోచన కూడా కలిగి ఉంటారు.వీరిలో ప్రధానంగా వీడియో జర్నలిస్టులు మాత్రమే అలా ఉంటారు. అంటే ఒక మంచి కెమెరామెన్ కి ఇది కూడా ఒక అర్హత అని చెప్పవచ్చు.
2. బ్యాక్ గ్రౌండ్ చూసుకోవడం.
వీడియో రికార్డ్ చేసే సమయంలో మనం షూట్ చేస్తున్న ఏ కార్యక్రమం అయినా…వీడియో షాట్స్ రికార్డ్ చేస్తున్న సమయం లో బ్యాక్ గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం.అలా అని ప్రతి రికార్డింగ్ షాట్స్ కి బ్యాక్ గ్రౌండ్ ఉంటుందని, ఉండదని చెప్పలేము. ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఆడిటోరియం,హాల్ లో కాకుండా ఔట్ డోర్ లో జరుగుతుంది అను కుందాం.కార్యక్రమం నిర్వాహకులు సభా వేదిక వెనుక బ్యాక్ గ్రౌండ్ లో తెరగానీ,క్లాత్ గానీ, పట్టాగానీ ఏర్పాటు చేయకపోతే కెమెరామెన్ రికార్డ్ చేసే విజువల్స్ నాణ్యత లోపం బాగా ఉంటుంది.మనం కెమెరా ఆ దిశగా ఆన్ చేసి చూస్తే అక్కడ కవరేజీ చేయాల్సిన విజువల్స్ కన్నా కెమెరాలోకి అక్కడ ఉన్న వెలుతురు అంటే బ్యాక్ లైట్,ఆపోజిట్ లైట్ అనేవి మనకు కావలసిన వీడియో షాట్స్ కి ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి కెమెరామెన్ దిశలు మార్చుకున్నా అక్కడ ఉపయోగం ఉండదు. అందుకు కెమెరాను బట్టి బ్యాక్ గ్రౌండ్ ఆపోజిట్ లైట్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.అది సెట్ చేసుకోవటం మంచిది.
3. కెమెరా/మొబైల్ పట్టుకునే విధానం.
వీడియో షాట్స్ తీసేందుకు ముందుగా కెమెరా పట్టుకోవడం అనేది చాలా ముఖ్యం కెమెరా పట్టుకోవడంతో పాటు కెమెరా ఎలా పట్టుకున్నాం అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. కెమెరా అయినా మొబైల్ అయినా సరే మనం చేత్తో పట్టుకున్నప్పుడు ప్రధానంగా కెమెరాలను వేళ్ళతోనే (మొబైల్స్ అయితే)పట్టుకోవడం జరుగుతుంది.అయితే మొబైల్ పట్టుకున్నప్పుడు మన చేతి వేళ్ళు కెమెరా ఎడ్జ్ లో మాత్రమే ఉండాలి.అలా కాకుండా చేతివేళ్ళు మొబైల్ కెమెరా లెన్స్ కి అడ్డంగా పెట్టి తీయడం కరెక్ట్ కాదు. అలాగే మొబైల్ ఫోన్ కి వాయిస్ రిసీవర్ ఉంటుంది.చేతివేళ్లతో ఆలోచన లేకుండా దానిని కూడా మూసివేసి పట్టు కుంటాం.అంటే మొబైల్ ద్వారా వీడియో షాట్స్ తీసేటప్పుడు మనకు ఈ ఆలోచనలు రావు.చేతి వేళ్ళు మొబైల్ కెమెరా లెన్స్ కి అడ్డు వస్తాయని, వాయిస్ రిసీవర్ మూసి వేస్తాయని గమనించ లేము.కాబట్టి వీడియో షాట్స్ తీసేటప్పుడు మొబైల్ ని ఈ అంశాలు గుర్తుపెట్టుకుని చేతివేళ్లతో జాగ్రత్తగా పట్టుకొని విజువల్స్ తీసుకోవడం మంచి అలవాటు.
4. వీడియో షాట్స్- లైటింగ్.
మనం వీడియో షాట్స్ తీసేటప్పుడు లైటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం లైటింగ్ లేకుండా ఒక మంచి దృశ్యాన్ని షూట్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి కెమెరామెన్ వీడియో షాట్స్ కి అవసరమైన లైటింగ్ విషయంలో చాలా మెలుకువగా ఉండాలి.లైట్ లేకుండా రాత్రి వేళ వీడియో షాట్స్ తీయడం అనేది సాధ్యపడదు.మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ వాటికి ఉన్న లెన్స్ లోపల అమర్చబడినటువంటి లైటింగ్ సెట్ చేసుకునే విధానం వీటినన్నిటినీ పరిశీలిస్తే… మొబైల్ ఫోన్స్ చాలావరకు ఆటోమోడ్ విధానంలో మనకు అవసర మైనటువంటి వీడియో షాట్స్ రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.అయితే… లైటింగ్ ప్రతిచోట అందుబాటులో ఉండదు.కాబట్టి మొబైల్ లో ఉన్న సెట్టింగ్స్ ఆధారంగా సాధ్యమైన మేరకు మంచి క్వాలిటీ ఇచ్చే వెలుతురు ఉన్న విజువల్స్ మాత్రమే న్యూస్ కోసం కవరేజ్ చేయటం ఒక స్ట్రింగర్ యొక్క మంచి లక్షణం.లైటింగ్ లేని విజువల్స్ ఎంతవరకు మనకు ఉపయోగపడ తాయి అనేది కూడా మనం ఆలోచించగలిగి ఉండాలి.ఈ విషయంలో లైటింగ్ అనేది ఎటువంటి కెమెరాలు అయినా సరే చీకటి సవాల్ చేస్తూ మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు. లైటింగ్ ఉన్నప్పుడు విజువల్స్ తీసుకోవడం తప్ప లేదా, లైట్ ఏర్పాటు చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు.
5. పోర్ట్రేట్ మోడ్ విజువల్స్
ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ కవర్ చేసే స్ట్రింగర్స్ మరిముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మన దగ్గర ఉన్నటు వంటి మొబైల్ ఫోన్స్ ద్వారానే ఇప్పుడు న్యూస్ కవర్ చేస్తున్నాం.అయితే ఇక్కడ మొబైల్ పట్టుకునే విధానం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మొబైల్ నిలువుగా పెట్టి విజువల్స్ తీయటాన్ని పోర్ట్రైట్ వీడియో విజువల్స్ అని అంటారు.చాలావరకు ఇటువంటి విజువల్స్ న్యూస్ బులెటిన్స్ లో వాడటం జరగదు.కాబట్టి కెమెరా జర్నలిస్టులు మొబైల్ ని నిలువుగా పెట్టి విజువల్స్ తీయడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. ఒకప్పుడైతే ఈ పోర్ట్రైట్ షాట్స్ చాలా వరకు న్యూస్ చానల్స్ వాడేవి కాదు.ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేవి కేవలం షాట్స్ అనే వీడియోస్ కోసం మాత్రమే వాడటం జరుగుతుంది. ఇంకో విషయం మీరు వీడియో షాట్స్ ఎలా తీసిన ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం న్యూస్ బులెటిన్స్ కి అవసరమైన విధంగా వీడియో షాట్స్ కట్ చేసుకోవడం జరుగుతుంది.అయితే ఈ పోట్రేట్ షాట్స్ అనేవి న్యూస్ ప్రాముఖ్యతను బట్టి వాడటం తప్ప లేదంటే ఈ షాట్స్ కి విలువ లేదు.కాబట్టి ఇటువంటి షాట్స్ పరిమితులపై స్ట్రింగర్స్ అవగాహన కలిగి ఉండాలి.
6. ల్యాండ్ స్కేప్ విజువల్స్.
ల్యాండ్ స్కేప్ అంటే, మనవద్ద ఉన్న మొబైల్ నిలువుగా కాకుండా అడ్డంగా పట్టుకొని జాగ్రత్తగా విజువల్స్ తీయటాన్ని ల్యాండ్ స్కేప్ మోడ్ విజువల్స్ అంటారు. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ స్క్రీన్ పై వార్తకి/వార్త కథనానికి సంబంధించిన విజువల్స్ ఫుల్ ఫ్రేమ్ కవర్ అయితేనే వార్తలు/వార్త కథనాలు చూడటానికి బాగుంటాయి.కాబట్టి ఫుల్ ఫ్రేమ్ కి కవర్ అయ్యే విజువల్స్ రావాలి అంటే మొబైల్ అడ్డంగా పట్టుకొని తీయడం ద్వారా… కెమెరా లో ఫ్రెమ్ సెంటర్ పాయింట్ లో సెట్ చేసుకోవడం ద్వారా క్వాలిటీ విజువల్స్ వస్తాయి.దీనినే ల్యాండ్ స్కేప్ అని అనడం జరుగు తుంది. పోర్ట్రైట్ విజువల్స్ ఫుల్ ఫ్రేమ్ లేని కారణంగా అక్కడ ప్రేక్షకులు చూసే విజువల్ లో నాణ్యత లోపం కనిపిస్తుంది.కాబట్టి ఈ ల్యాండ్ స్కేప్ విధా నాన్ని విజువల్స్ తీసే జర్నలిస్టులు అవలంబించి తీరాలి.ఒకరకంగా చెప్పా లంటే ఇది సినిమా తెరపై 35mm,70mm స్క్రీన్ ల మాదిరి తేడాగా గమ నించాలి.
7. టిల్ అప్ విజువల్స్
విజువల్స్ తీసే జర్నలిస్టు రాయాలి అనుకున్న వార్తకు అనుగుణంగా విజువల్స్ తీయాలి. ఇక్కడ కెమెరామెన్ గ్రహించాల్సిన విషయం పెద్ద పెద్ద భవనాలు, గోపురాలు వంటివి కవర్ చేయాలంటే అవి ఒక ఫ్రేములో తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.ఇటువంటి అప్పుడు ఒక గోపురాన్ని కవర్ చేయాలి,ఆ గోపురం పై ఉన్న శిల్ప సంపద కూడా కవరేజీలో కనిపిం చాలి అని భావిస్తే అప్పుడు ఆ గోపురం ఎదురు నిలుచుని గోపురం కింది భాగం ప్రేమ్ సెట్ చేసుకొని కెమెరాను నెమ్మదిగా ప్రేము కదలకుండా గోపురం వచ్చేలా కెమెరాని పైకి మూవ్ చేయడం ద్వారా తీసే విజువల్ ని టిల్ అప్ అని అంటారు.ఈ విజువల్ ద్వారా గోపురం మొత్తం చూపించడంతోపాటు గోపురం పై ఉన్నటువంటి శిల్ప సంపద కూడా కొంతమేరకు వీడియోలో ఫోకస్ కాబడుతుంది. అయితే ఇటువంటి విజువల్స్ ఏ సమయంలో తీసుకోవాలి అనేది కూడా కెమెరా ఉపయోగించే వీడియో జర్నలిస్టుకి అవగాహన ఉండాలి.
8. టిల్ డౌన్ విజువల్స్.
చేతిలో ఉన్న కెమెరా గాని,మొబైల్ ద్వారా గాని మనకు అవసరమైనటు వంటి విజువల్స్ తీసు కోవాలి అంటే వాటిలో టిల్ డౌన్ విజువల్స్ ఎలా తీసు కోవాలి అసలు టిల్ డౌన్ అంటే ఏమిటి అనేది తెలు సుకుందాం.అదే విధంగా టిల్ అప్ విజువల్స్ టేకింగ్ మాదిరిగానే టిల్ డౌన్ విజువల్స్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది.
ఒక గోపురం పై ఉన్నటు వంటి శిఖర భాగాన్ని అక్కడ ఉన్న ప్రత్యేకత లను రికార్డు చేస్తూ ఆ విజువల్స్ దేనికి సంబంధించినవి అనేది తెలియజేసేందుకు శిఖర భాగాన్ని ఫ్రేమ్ చేసుకొని షూట్ చేయటం అలాగే అక్కడ సెట్ చేయబడినటువంటి ఫ్రేమ్ ఆధారంగా గోపురం శిఖర భాగం నుండి కెమెరాను మెల్లగా కిందికి మూవ్ చేస్తూ విజువల్ రికార్డ్ చేయడం టిల్ డౌన్ షాట్ అని అంటారు.
9. లెఫ్ట్ టూ రైట్ పానింగ్.
న్యూస్ కవరేజీలో ఉన్న కెమెరా జర్నలిస్టు కానీ…ఆ న్యూస్ రాయడానికి కెమెరామెన్ వెంట ఉన్న జర్నలిస్టు కానీ కెమెరా షాట్స్ విషయంలో ఇద్దరు ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. అవసరమైన విజువల్ ని కెమెరా ఫ్రేమ్ లోకి తీసుకోవడం చాలా ముఖ్యం.కాబట్టి వీడియో జర్నలిస్టు తమ జర్నలిస్టుతో మాట్లాడి అవసరమైనటువంటి విజువల్స్ పై ఇద్దరూ చర్చించుకుని ముందు గానే డిక్లేర్ చేసుకోవాలి. ఇక వీడియో జర్నలిస్టు తాను తీసే షాట్స్ లో లెఫ్ట్ టు రైట్ పానింగ్ షార్ట్ కి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి.ఈ షాట్ అంటే మన చేతుల్లో ఉన్న కెమెరా ని అవసరమైనటువంటి ఏరియా పై ఫోకస్ చేస్తూ ఎడమ ప్రక్కనుంచి కుడి పక్కకు కెమెరాను నెమ్మది గా జరుపుతూ తీసే విజు వల్ ని లెఫ్ట్ టు రైట్ పానింగ్ షాట్ అని అంటారు.ఈ షాట్ తీసే టప్పుడు మన చేతిలో ఉన్న కెమెరాని ఇష్టాను సారంగా వేగంగా మూవ్ చేయటం సరైన పద్ధతి కాదు.మనం తీయబోయే షాట్ ఎడమ నుంచి కుడి వైపుకు మీడియం లెవెల్ లో కొంచెం నిదానంగానే కెమెరా మూవ్ చేస్తూ మనకు కావలసిన విజువల్ తీసుకోవడం చేయాలి.వేగం పెంచడం వల్ల విజువల్ నాణ్యత కోల్పోయి బూదరగా కనిపించే అవకాశం ఉంటుంది.
10. రైట్ టూ లెఫ్ట్ పానింగ్.
లెఫ్ట్ టు రైట్ పానింగ్ షాట్ ప్రాముఖ్యత ఏమిటో అదే విధంగా రైట్ టు లెఫ్ట్ ప్యానింగ్ షాట్ కూడా వీడియో జర్నలిస్టులు తీయవలసి ఉంటుంది. కెమెరా షాట్స్ నాలుగు విధాలుగా తీయగలిగితే టీవీ స్క్రీన్ పై ప్లే అవు తున్న వార్తని/ వార్త కథ నాన్ని చూడడానికి టీవీ ప్రేక్షకులు ఆసక్తి కనపరు స్తారు.ఇక్కడ చెప్పుకోదగిన మరో విషయం ఏమిటంటే మనిషి కన్ను ఏకధాటిగా ఒకే దృశ్యాన్ని ఎక్కువ సమయం చూడడం అనేది చాలా కష్టం.అలాగే నాణ్యత లేనటువంటి విజువల్స్ చూడటం కూడా మనిషి కంటికి చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది.ఏది ఏమైనా కెమెరామెన్ తాను రికార్డు చేసిన విజువల్స్ ద్వారా టీవీ ప్రేక్షకులను టీవీ ముందు నుంచి కదలనివ్వ కుండా కట్టిపడేసే విధంగా విజువల్స్ ఉండాలి. అయితే ప్రస్తుతం ఇక్కడ చెప్పబడిన షాట్స్, వీడియో విజువల్స్ టేకింగ్ అనేది స్ట్రింగర్స్ గా పని చేస్తున్న జర్నలిస్టులను మాత్రమే దృష్టిలో పెట్టు కుని చెప్పడం జరిగింది. ఒక వీడియో జర్నలిస్టు ఒక వార్త/వార్త కథనానికి సంబంధించినటువంటి ఈ విజువల్స్, షాట్స్ అనేవి పాటిస్తే ప్రొఫెషనల్ కెమెరామెన్ అవలంబించే విధానం అని గ్రహించాలి. దీనిపై దృష్టి పెడితే చాలా వరకు మీరు పనిచేసే చానల్స్ కు మీకు అవసర మైన విజువల్స్ కి న్యాయం చేసిన కెమెరా మెన్ గా ప్రత్యేక స్థానం దక్కించుకుంటారు.
11. లాంగ్ షాట్
లాంగ్ షాట్ అనగా ఒక ఎత్తైనటువంటి కట్టడాన్ని లేదా ఒక విశాలమైనటు వంటి ప్రాంతాన్ని అవుట్ లుక్ చూపించాలి అంటే ఈ లాంగ్ షాట్ ని కెమెరామెన్ ఉపయోగించాలి.మనం వీడియో తీయాలి అను కున్న కట్టడాన్ని,ప్రాంతాన్ని మరేదైనాఎత్తైన,కొద్దిగా విశాలంగా ఉన్న నిర్మాణా లు,ప్రాంతాలను మనం వీలైనంత వెనకకు వెళ్లి మొబైల్ ఫ్రెమ్ లో కవర్ చేయాలనుకున్న ప్రాంతం మొత్తం చూపించేందుకు ఈ షాట్ ఉపయోగపడు తుంది.ఈ లాంగ్ షాట్ ను ఉపయోగిస్తూ సాధ్యమైన మేరకు మనం షూట్ చేయాలనుకున్న ప్రాంతాన్ని మెల్లగా జూమ్ చేసుకుంటూ ప్రేమ్ సెట్ చేసుకొని విజువల్ టేకింగ్ చేసుకోవాలి ఎంత లాంగ్ షాట్ అయినప్పటికీ మనం చూపించాలి అనుకున్న ప్రాంతం తప్పనిసరిగా మొబైల్ ఫ్రెమ్ లో షేక్ కాకుండా జాగ్రత్తగా జూమ్ చేసుకుని కవర్ చేసుకో వటం అనేది ఈ లాంగ్ షాట్ ప్రత్యేకం.
12. మిడిల్ షాట్
ఈ మిడిల్ షాట్ అనేది కూడా దాదాపు లాంగ్ షాట్ మాదిరిగానే ఉంటుంది.అయితే జూమ్ షాట్ కి లాంగ్ షాట్ కి మధ్య మనం ఫోకస్ చేయాలనుకున్నటువంటి ప్రాంతాన్ని అటు దూరం గాను ఇటు దగ్గరగాను కాకుండా మిడిల్ షాట్ అనేది తీసుకోవడం జరుగుతుంది.ఈ షాట్ వలన రాసిన కథనానికి అనుగుణంగా ఈ షాట్ ను కూడా మనం ఇచ్చే కథనంలో ఎక్కడో ఒకచోట కదానుగుణంగా విజువల్స్ వాడుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే మిడిల్ షాట్ అనే దానిని కూడా మనం ఒక షాట్ గా తీసి విజువల్ దగ్గర పెట్టుకోవడంతో అవసరానికి అనుకూలం గా ఈ షాట్ ఉప యోగించుకోవడం జరుగు తుంది.
13. క్లోజ్ షాట్
ఈ షాట్ విషయంలో మొబైల్ ద్వారా విజువల్ తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది.ఇక్కడ క్లోజ్ షాట్ కి-క్లోజప్ షాట్ కి కొంచెం తేడా ఉంటుంది. మనం ఫోకస్ చేయాలను కున్నటువంటి ప్రాంతాన్ని ప్రేమ్ సెట్ చేసుకుని వీలై నంత దగ్గరగా విజువల్ చూపించటానికి తీసుకున్న వీడియో షాట్ ని క్లోజ్ షాట్ అని అంటారు.ఇక క్లోజప్ షాట్ విషయానికి వస్తే ఉదాహరణకు సాధ్యమైన మేరకు మనిషి ముఖంలో తల భాగాన్ని కట్ చేస్తూ కంటి పై కనుబొమలు అదే మనిషి ముఖంలో పెదవు ల కింది భాగాన్ని గడ్డం కొద్దిగా కట్ చేస్తూ తీసే షాట్ ని క్లోజప్ షాట్ అని అంటారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం చాలా వరకు వార్త కథనాలకు అవసరమైనటువంటిది క్లోజ్ షాట్, క్లోజప్ షాట్ అనేది దాదాపు వార్త కథ నాలకు గాని వార్తకుగాని పెద్దగా అవసరం ఉండదు.
14. ఫుల్ ఫ్రేమ్
ఫుల్ ఫ్రెమ్ అంటే మనకు కావలసినటువంటి ప్రాంతాన్ని మనం విజువల్ తీస్తునటువంటి మొబైల్ లో మనం కవర్ చేయాల నుకున్న విజువల్ ని మొబైల్ స్క్రీన్ కి మొత్తం కవర్ అయ్యేలా విజువల్ తీసుకోవడానికి ఫుల్ ఫ్రేమ్ గా చెబుతాం.ఒకరకంగా చెప్పాలి అంటే ఈ ఫుల్ ఫ్రేమ్ షాట్,లాంగ్ షాట్ కాకుండా మిడిల్ షాట్ కాకుండా క్లోజ్ షాట్ కాకుం డా మనకు అవసరమైన విధంగా ఫ్రెమ్ మొత్తం దృశ్యం ఫోకస్ అయ్యేలా విజువల్ టేకింగ్ చేయటం ఫుల్ ఫ్రేమ్ అంటారు.వార్త కథనానికి,వార్తకు అనుకూ లంగా ఏదైనా ఒక వస్తువు ని ఒక భాగాన్ని ప్రత్యేకంగా చూయించటమే ఈ ఫుల్ ప్రేమ్ షాట్ కి అర్థం. సహజంగా ఈ షాట్ ని ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏ షాట్ ని ఎలా తీసినా విజువల్ ని అవసరమైన విధంగా సెట్ చేసుకోవడం కూడా జరుగుతుంది.అంటే కెమెరామెన్ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని టార్గెట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు.ఆయిన ప్పటికీ కెమెరామెన్ అనే వ్యక్తి ఫుల్ ఫ్రెమ్ వాడటం వల్ల అవసరానికి అనుగు ణంగా నాణ్యమైన విజువ ల్ ని కథనంలో చూపించ డానికి ఈ షాట్ బాగా ఉప యోగపడుతుంది.
15. బస్ట్ షాట్
బస్ట్ షాట్ అనగా సహజంగా ఈ షాట్ ఎక్కు వగా ప్రెస్ మీట్, మీట్ ది ప్రెస్ లలో ఎదుటి వ్యక్తుల వాయిసులు తీసుకునే సమయంలో ఈ షాట్ అవసరం ఏర్పడుతుంది. అయితే బస్ట్ అనగా మనిషి కూర్చుని ఉన్నా, నిలుచుని ఉన్నా ఆ మనిషి యొక్క తల పై భాగంపై కొద్దిగా గ్యాప్ ఇచ్చి గుండె కిందకు పొట్ట పైభాగం కు ప్రేమ్ కట్ చేసుకుని తీసుకునే విజువల్ ని బస్ట్ షాట్ అని అంటాము.ఇది ఒక రకంగా పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలో కనిపించే చిత్రంలా ఉంటుంది.ఈ షాట్ వల్ల ఉపయోగాలు మనిషి ముఖం స్పష్టంగా కనపడ టం జరుగుతుంది.మనం ఎదుటి వ్యక్తి వాయిస్ తీసుకునేటప్పుడు మన చానల్ లోగో కూడా కవర్ అవుతుంది దాదాపు ఈ బస్ట్ షాట్ అనేది పలురకా లుగా మనకు వార్త/వార్తా కధనాలలో ఉపయోగ పడుతుంది.మరి ముఖ్యం గా గుర్తుపెట్టుకోవాల్సింది మాట్లాడే వ్యక్తిని చూయిం చాలన్న మన లోగో కనిపించాలన్నా ఆ వ్యక్తిని ఒక క్రమపద్ధతిలో ప్రేమ్ సెట్ చేసుకుని తీసుకోవడం ద్వారా టీవీ వీక్షకులకు చూసేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.ఈ విజువల్ విషయంలో జాగ్రత్త పాటించకపోతే టీవీ వీక్షకులు కొంత ఇబ్బంది కరంగా ఫీల్ అవుతారు.
16. ఏరియల్ వ్యూ
వార్త/వార్త కథనం లో ఈ ఏరియల్ వ్యూ అనే ది చాలా వరకు వార్తకు ప్రత్యేక విజువల్ గా ఉం టుంది.ఈ విజువల్ మనం చూయించగలిగితే టివి వీక్షకులు మనసులో కొంత ఉత్తేజితులుగా మారతా రు.ఒక ఏరియాలో జరిగి నటువంటి సంఘటనను ఒక ప్రాంతానికి చెందిన కథ నాలను మనం రాసినప్పు డు దానికి సంబంధించి నటువంటి విజువల్స్ ఛానల్ వీక్షకులకు చూపిం చాలి అంటే ఆ ప్రాంతం యొక్క ఏరియల్ వ్యూ అనేది కథనంలో ఒక ఉపోద్ఘాతంలా ప్రేక్షకునికి అర్ధం అవుతుంది.ఎక్కువ గా ఈ షాట్ ప్రత్యేక కథనా లలో చూయించగలిగి ఉండాలి.ఒక నగరాన్ని ఒక గ్రామాన్ని ఒక ప్రత్యేకమైన ప్రాంతాలను ఫోకస్ చేసి చూపించడంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఎత్తయిన ప్రాంతాల పైకి ఎక్కి,చేతిలో ఉన్న మొబైల్ ద్వారా విజువల్స్ తీసుకోవడాన్ని “ఏరియల్ వ్యూ” షాట్ అని అంటారు. సహజంగా ఈ షాట్ కోసం గ్రామాలలో గాని పట్టణాల లో గాని,ఎత్తుగా ఉండే కట్టడాలు,కొండ ప్రాంతాలు వంటి వాటిపైకి ఎక్కి,లెఫ్ట్ టూ రైట్ పానింగ్, రైట్ టు లెఫ్ట్ పానింగ్ చేయగలిగి నంతవరకు క్లోజ్ షాట్ వంటి విజువల్స్ తీసు కోవడం ఏరియల్ వ్యూ షాట్స్ గా చెప్పటం జరుగు తుంది.సహజంగా మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఏరియాలో వరదలు, ముంపు వంటి సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ప్రధానంగా సీఎం వంటి వారు ప్రత్యేక హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు అనే మాట వింటూ ఉంటాము. సాధ్యమైనంత ఎత్తు అయి నటువంటి ప్రాంతం నుంచి మనం కింది ప్రాంతాలను గమనిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కొంత మేరకు అవగాహన జరు గుతుంది.ఆ కారణంగానే ఈ ఏరియల్ సర్వే జరుగుతుంది అదే విధంగా మనం కూడా వార్తకు/వార్తా కథనాలకు అనుగుణంగా ఛానల్ వీక్షకులను ఆకట్టు కునేందుకు ఏరియల్ వ్యూ షాట్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
17. రన్నింగ్ షాట్
ఈ రన్నింగ్ షాట్ అనేవి ఛానల్ వీక్షకులకు చూసేందుకు బాగుంటాయి కానీ వీటిని టేకింగ్ చేసిన కెమెరామెన్స్ చాలా ఇబ్బం దులకు గురవుతారు.సహ జంగా ఓ మంత్రి,ప్రముఖు లు విఐపి,పలువురు సెల బ్రిటీలు వెళ్ళే వాహనాల కాన్వాయిలను కవర్ చేయాలంటే కెమెరమెన్ ఆయా వాహనశ్రేణిలను వెంటాడవల్సి ఉంటుంది. ఆ సమయంలో కెమెరా మెన్ కెమెరాను చెక్ చేస్తూ, కెమెరా ఫ్రేమ్ సెట్ చేసుకొని వాటిని వెంటాడుతూ కెమెరాలో బంధించటం ప్రమాదంతో కూడుకున్న పని అయినప్పటికీ కెమెరామెన్ సాహసం చేసి మనకు ఆ విజువల్స్ అందించటం జరుగుతుంది.అలాగే రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ప్రత్యేకమైన వాటిని కవర్ చేయటం కోసం కూడా రన్నింగ్ షాట్స్ ఉపయోగపడతాయి.ఈ షాట్స్ విషయంలో కూడా మొబైల్ కెమెరామెన్ మంచి జాగ్రత్తలు తీసుకో వాలి ఇక్కడ మనం చూయించాలనుకున్నటువంటి ఏరియా జూమ్ చేసి చూపిస్తే రన్నింగ్ షాట్స్ లో బ్లర్ అయిపోతాయి. కాబట్టి కొద్దిగా వైడ్ షాట్స్ గా ఈ రన్నింగ్ షాట్స్ తీసు కోవడం మంచిది. ఈ రన్నింగ్ షాట్స్ విషయంలో కెమె రామెన్ తప్పక పాటించవలసిన విషయం విజువల్స్ బ్లర్ కాకుండా చూసుకోవడం కెమెరామెన్ భాద్యత.
18. విజువల్ టైమింగ్
విజువల్ టైమింగ్ అనేది వీడియో ఎడిటింగ్, కెమెరామెన్ మధ్య సంభం దం కలిగి ఉంటుంది.వార్త కు/వార్తా కథనానికి అవ సరమైన విజువల్స్ తీయా ల్సిన భాద్యత మొత్తం కెమెరామెన్ పైనే ఉంటుం ది.ఈ విషయంలో కెమెరా మెన్ ఎంత కష్టపడినా, ఎన్ని విజువల్స్ తీసినా, ఎలా తీసినా విజువల్ టైమింగ్ అనేది పాటించక పోతే కెమెరామెన్ కష్టం అంతా వృధా అయిపోవ డంతో పాటు విజువల్ పరంగా మనం ఆ వార్తను/వార్తా కథనాన్ని కిల్ చేసేసినట్లే.అయితే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే జరు గుతున్న టువంటి సంఘటనలు గాని,సమావేశాలు కానీ,ఏ కార్యక్రమమైనా సరే మన మొబైల్ ద్వారా తీసుకునే టువంటి విజువల్ కనీసం కట్ షాట్స్ రూపంలో ఒక్కో షాట్ 10 సెకండ్స్ ఉండాలి.కొందరు మొబైల్ విజువల్ టేకర్స్ రెండు సెకండ్లు,మూడు సెకండ్లు నాలుగైదు సెకండ్ల నిడివి గల విజువల్స్ తీసుకొని చాలా మంది ఇక పని అయిపోయింది అను కుంటారు.దీని వలన ప్రాబ్లం ఎలా ఉంటదంటే రెండు సెకండ్లు,నాలుగు సెకండ్లు లోపు తీసిన విజు వల్స్ ఏవైనా సరే వీడియో ఎడిటింగ్ చేసే సమయం లో కనీసం వీడియోని కట్ చేసుకోవాలన్న,లేదు అదే వీడియో షాట్ ని పెంచు కోవాలన్న ఎడిటింగ్ చేసే వ్యక్తులకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.ఎడి టింగ్ చేసే వ్యక్తులు సహ నం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి.ఒక కథనానికి అవసరమైన విజువల్స్ పూర్తి చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఏర్పడతాయి.మొత్తంగా చెప్పాలంటే విజువల్స్ ఎన్ని ఉన్నా ఉపయోగం లేని పరిస్థితులు ఎదురవు తాయి.కాబట్టి కెమెరామెన్ విజువల్స్ తీసుకునేటప్పు డు ఏ విజువల్ అయినా సరే కనీసం 10 సెకండ్లు తీసుకోవడం ద్వారా ఉప యోగమే కాని నష్టాలేమి ఉండవు.కెమెరామెన్ అనే వ్యక్తి విజువల్స్ టైమింగ్ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
19. పరఫెక్టు ఫ్రేమ్
కెమెరామెన్ అనే వ్యక్తి ఏదైనా ఒక విజువల్ తీయాల్సి వచ్చినప్పుడు మొబైల్ ఆన్ చేసే ముందు,అక్కడ వీడియో తీయాల్సిన అవసరం మనకు అనుకూలంగా ఉందా….లేదా….అనేది అన్ని విధాలా ఓ ఆలోచన కు రావాలి.అంటే లైటింగ్, ఎత్తు-పల్లాలు,ఎటు నుండి ఏ యాంగిల్,మనం తీయబోయే షాట్ అంతా క్లియర్ గా ఉంది అనుకున్న తరువాత షాట్ ఓకే చేయడాన్ని ఫర ఫెక్ట్ షాట్ గా చెబుతారు.
20. కెమెరా మూమెంట్స్.
కెమెరా మూమెంట్స్ అనగా కెమెరాకు ప్రత్యేకం గా ఏ విధమైన కదలికలు ఉండవు.కానీ మనం చిత్రీకరిస్తున్న ఏ కార్యక్రమమైనా మధ్య, మధ్యలో కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే మూమెంట్స్ (కదలికలు)పై మనం దృష్టి సారించాలి.ఉదాహరణకు ఓ సీఎం మహాసభ కవరేజి లో ఉన్న మనం,అక్కడ సభాప్రాంగణంలోకి సీఎం ప్రవేశించే విజువల్స్,సభా ప్రాంగణంలో ప్రజల కదలికలు,ప్రజలు స్పందన,చిన్న చిన్న నిరసన ప్రదర్శనలు, ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ నిలుచున్న వ్యక్తులు ఇలా పబ్లిక్ మీటింగ్స్ లలో కెమెరామెన్స్ యాక్టివ్ గా ఉండాలి.అవసరం అనుకున్న సమయంలో కెమెరా కదలికలు మార్చుకోవాలి.ఒకవేళ కెమెరా అనేది ట్రై పాడ్ పై ఉంటే అవసరమైన రీతిలో కెమెరా కదలికలు ఉన్నపళంగా మార్చుకోవడం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది.
21. విజువల్ TCR.
విజువల్ TCR అంటే ఇది కొంత ఆశ్చర్యంగా అనిపించే స్తుంది.ఇది చాలామంది కెమెరామెన్స్ కి, జర్నలిస్టు లకు కూడా తెలియని పదమే… అయితే మనం తీసిన విజువల్స్ లో ప్రత్యేక భాగాన్ని,ఓ గుర్తింపు కలిగిన సన్నివేశాన్ని రివైండ్, ఫార్వార్డ్ చేసుకుని చూడడానికి,ఎడిటింగ్ లో అవసరం లేని రికార్డ్ కాబడిన సన్నివేశాన్ని తొలవించాలి లేదా ఉపయోగించాలి అనుకున్నప్పుడు విజువల్ TCR అనేది ఉపయోగం ఉంటుంది.ఇక TCR అనే పదానికి అర్థం (టైం కోడ్ రికార్డర్)అనగా మన కెమెరాలో రికార్డ్ కాబడు తున్న దృశ్యాలను స్క్రీన్ పై రికార్డ్ అవుతున్న అంకె లు సెకెండ్స్, నిమిషాలు, గంటలు ఇలా రికార్డింగ్ అయ్యే అంకెలను టైం కోడ్ రికార్డర్ అంటారు. దీనిని గమనిస్తూ మనకు అవసరమైన నిడివిలో వీడియో రికార్డ్ చేసు కోవచ్చు.
22. క్లోజ్ అప్ షాట్.
క్లోజ్ అప్ షాట్ అనగానే ఇది కూడా అందరికి తెలిసిన షాట్.(క్లోజ్-క్లోజ్ అప్)షాట్స్ వివరణలోకి వెళితే ఈ రెండు షాట్స్ ఒకలా అనిపించినా ఉన్న చిన్న తేడాని గమనించండి.ఇక మనిషిని ఒక పాస్ పోర్ట్ సైజు కన్నా మరింత దగ్గరగా (క్లోజ్)గా తీసే విజువల్స్ ని క్లోజ్ ఆప్ షాట్ అవుతుంది.అనగా పాస్ పోర్ట్ సైజుని మరింత కుదించాల్సి వస్తే…అంటే కేవలం ముఖంలో తలపై జుట్టు,గడ్డం అంచుగా కట్ చేసి క్లోజ్ గా తీసే షాట్స్ క్లోజ్ అప్ షాట్స్ గా తీయడం జరుగుతుంది.
23. గెయిన్ అప్ షాట్స్
గెయిన్ అప్ షాట్స్ అంటే వీటివల్ల పెద్ద ఉపయోగం లేదు.ఇలాంటి విజువల్స్ రికార్డ్ చేసి అనంతరం రీప్లే చేసి చూస్తే ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు కొంత కాంతివంతంగా క దులుతున్నట్లు కనిపిస్తాయి.ఈ విధమైన దృశ్యాలు వార్తా విజువల్స్ కి పనికిరావు.ఒక రకంగా చెప్పాలి అంటే డిస్కో లైట్స్ ఎఫెక్ట్ వలే ఉంటాయి.ఈ షాట్ అవగాహన కోసం రాయడం జరిగింది తప్ప ప్రత్యేకం ఏమీ కాదు. వార్తలు/వార్తా కథనాలకు స్పెషల్ గా ఉంటుంది అని కూడా ఈ విధమైన షాట్స్ ఉపయోగించరాదు.
24. రిఫ్లెక్ట్ షాట్స్.
రిఫ్లెక్ట్ షాట్స్ అనేవి కూడా ఒక ఖచ్చితమైన షాట్ గా చెప్పలేం.ఇక్కడ మనం తీయాలి అనుకున్న దృశ్యాలతో పాటు కెమెరాలోకి అనవసరమైన లైటింగ్ వచ్చి చేరుతుంది. దీనివల్ల విజువల్ అనేది చూసేందుకు అస్పష్టంగా కనిపిస్తుంది.ఈ విజువల్ కూడా వార్తలు/వార్తా కథనాలకు పనికిరావు. ఎండకు ఎదురుగా కెమెరా ఉంచి లైట్ ఫోకస్ అయ్యేలా తీసే విజువల్స్ ఎండవేడిమి,ఎండాకాలం ప్రజల ఇబ్బందులు చెప్పేందుకు స్పెషల్ గా తీసి స్టోరీలో చూయించాలనే ప్రయత్నం చేసినా,కెమెరా లెన్స్ కు ఇబ్బంది ఉంటుంది.
25. స్పెషల్ ఎఫెక్ట్స్.
స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి దాదాపు ఏ మాత్రం కెమెరా ద్వారా రికార్డ్ చేసేవి కాదు.ఇవన్నీ ఎడిటింగ్ చేయు క్రమంలో తగిన విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ లను కలిగివున్న వీడియో ఎడిటర్స్ చేసే పని.
ఇప్పటివరకు తెలుసుకున్న ఈ వీడియో షాట్స్ అన్నీ తెలుసుకోగలిగితే చాలా వరకు మీడియారంగంలో కెమెరా జర్నలిస్టులుగా రాణించే అవకాశం బాగా ఉంది.ఈ షాట్స్ వివరణ అంతా ప్రొఫెషనల్ గా మీకు అందించడం జరిగింది.అలాగే న్యూస్ చానల్స్ కి ఏ విధమైన వీడియో విజువల్స్ అవసరం ఉంటుంది అనే కోణంలోనే మీకు అందించాను.అలాగే ఒకప్పటిలా భుజాలపై మోసే కెమెరాలు,చేతిలో ఇమిడిపోయే హ్యాండీ క్యామ్స్ ని చిన్న,చిన్న విలేకరులు అయితే ఉపయోగించడంలేదు.ఇప్పుడు అంతా మొబైల్ క్యామ్స్ ద్వారానే విజువల్స్ చిత్రీకరణ జరుగుతుంది.ఇక్కడ ఇవ్వబడిన వీడియో షాట్స్ వివరణ అంతా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉపయోగించే షాట్స్ గురించి రాయడం జరిగిందని పాఠకులు గ్రహించాలి.



