గుంటూరు:
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు వరకూ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గుంటూరులో వర్షాల దెబ్బ – కొత్త ఇబ్బందులు
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుంటూరులో జనజీవనం అతలాకుతలమైంది. రహదారులు చెరువుల్లా మారిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వర్షాలతో మరో కొత్త సమస్య గుంటూరువాసులను కలవరపెడుతోంది.
అరండల్ పేట రోడ్లపై కండోమ్‌లు – ప్రజలకు షాక్
నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే అరండల్ పేట రోడ్లపైకి వర్షపు నీటితో పాటు కండోమ్‌లు కొట్టుకొచ్చి చేరడం నగరవాసులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజలు, భక్తులు, వాహనదారులు చూసి చీదరించుకున్నారు. వినాయక చవితి సందర్భంలో విగ్రహాలను దర్శించడానికి వచ్చే భక్తులు రోడ్లపై కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లాడ్జి ముందు రహదారిపై కలకలం
ప్రత్యేకంగా, అరండల్ పేటలోని ఒక లాడ్జి ముందు రోడ్డుపై పెద్ద సంఖ్యలో కండోమ్‌లు కనిపించడం కలకలం రేపుతోంది. రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు అసహనంతో దాటుకుంటూ వెళ్తున్నారు.
ఆ లాడ్జిలో ఏమి జరుగుతోంది? – ప్రజల ప్రశ్న
ఈ ఘటనతో “ఆ లాడ్జిలో ఏమి జరుగుతోంది?” అన్న చర్చ గుంటూరు నలుమూలలా మొదలైంది. నగర మద్యలో ఇంతటి పరిస్థితి ఏర్పడినా పోలీసులు ఏ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత లాడ్జి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ – పోలీసులపై ఒత్తిడి
రోడ్లపైకి చేరిన కండోమ్‌ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు, ఫొటోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ పరిణామం వల్ల గుంటూరు పోలీసుల పనితీరు పట్ల ప్రశ్నలు లేవుతున్నాయి.
ఇకనైనా పోలీసులు ఆ లాడ్జిపై చర్యలు తీసుకుంటారా? లేక మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయా అన్నది చూడాలి.



