భారీ వర్షాలు మరియు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటి ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరినప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండో, 53 అడుగుల వద్ద మూడో హెచ్చరిక జారీ అవుతుంది.
భక్తులు, స్థానికుల కోసం అప్రమత్తత
వర్షం కారణంగా స్నాన ఘట్టాల మెట్లు నీటిలో మునిగాయి. భక్తులు నదిలో స్నానాలు చేయడం ప్రమాదకరంగా మారింది. పోలీసులు పవిత్ర స్నానాల ప్రాంతాల్లో పహారా ఏర్పాటు చేసి, ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పర్ణశాల, నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి. భద్రాచలం పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వరద పరిస్థితుల ప్రభావం
- 43 – 48 అడుగులు: భద్రాచలం పట్టణం ముంపుకు గురవుతుంది.
- 48 – 53 అడుగులు: చర్ల, దుమ్ముగూడెం మండలాల 13 గ్రామాలు, భద్రాచలం పట్టణం ప్రభావితమవుతాయి.
- 53 – 58 అడుగులు: చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల 48 గ్రామాలు ముంపునకు గురవుతాయి.
- 63 – 68 అడుగులు: ఆరు మండలాల 85 గ్రామాలు వరద ప్రభావానికి లోనవుతాయి.
- 73 అడుగులు: అత్యంత ప్రమాదకర స్థాయి, భద్రాచలం పట్టణం సహా మొత్తం 109 గ్రామాలు ముంపునకు బారినపడతాయి.
1986లో గోదావరి నీటిమట్టం 75.60 అడుగులకు, 2022లో 71.30 అడుగులకు చేరి రికార్డులు సృష్టించాయి. ఈ వరద ఈ రెండో అతిపెద్ద వరదగా గుర్తింపు పొందింది.



