ఇప్పటి డిజిటల్ యుగంలో ఉద్యోగి కావొచ్చు, వ్యాపారవేత్త కావొచ్చు, విద్యార్థి కావొచ్చు—జీమెయిల్ అనేది ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో కీలకమైన భాగమైపోయింది. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపుకోవడానికి, పొందడానికి, భద్రపర్చుకోవడానికి జీమెయిల్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలలో వర్క్ కమ్యూనికేషన్ మొత్తం జీమెయిల్ ద్వారానే సాగుతుంది.
అయితే, తరచుగా ఎదురయ్యే సమస్య—జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ కావడంతో కొత్త మెయిల్స్ రాకపోవడం. ఈ సమయంలో ఎలా క్లీనప్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిజానికి కొన్ని నిమిషాల్లోనే స్టోరేజ్‌ను పూర్తిగా ఖాళీ చేసుకోవచ్చు. ఎలా అంటే—
జీమెయిల్ స్టోరేజ్‌ను పూర్తిగా క్లీనప్ చేయాలంటే?
- మీ జీమెయిల్ ఖాతాను ఓపెన్ చేయండి.
- ఇన్‌బాక్స్‌లో ఉన్న మెయిల్స్ అన్నింటినీ ఎంచుకోవడానికి పై భాగంలోని చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి.
- ‘సెలెక్ట్ ఆల్ కన్వర్సేషన్స్’ అనే ఆప్షన్ కనిపిస్తే దాన్ని ఎంచుకోండి.
- తరువాత డిలీట్ (బిన్) ఐకాన్‌పై క్లిక్ చేస్తే మెయిల్స్ తొలగిపోతాయి.
సోషల్ మీడియా, ప్రమోషన్ మెయిల్స్ ఇలా క్లియర్ చేయండి
- జీమెయిల్లోకి వెళ్లి Promotions లేదా Social ట్యాబ్‌ను ఓపెన్ చేయండి.
- పై భాగంలో ఉన్న ‘Select All’ పై క్లిక్ చేయండి.
- డిలీట్ బటన్‌ను నొక్కితే వేల కొద్దీ ప్రమోషనల్ మెయిల్స్ ఒకేసారి తొలగిపోతాయి.
తప్పుగా డిలీట్ చేసిన మెయిల్స్‌ను ఎలా రీస్టోర్ చేద్దాం?
- మీరు డిలీట్ చేసిన మెయిల్స్ 30 రోజుల పాటు ‘బిన్’ ఫోల్డర్లో భద్రపడి ఉంటాయి.
- ఆ ఫోల్డర్లోకి వెళ్లి కావాల్సిన మెయిల్స్‌ను ఎంచుకొని ‘Restore’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అవి తిరిగి మీ ఇన్‌బాక్స్‌లోకి చేరతాయి.
నెలకోసారి అనవసర మెయిల్స్ తొలగించడం అలవాటు చేసుకోండి
అవసరం లేని మెయిల్స్, పాత ఫైల్స్‌ను తరచూ తొలగిస్తే స్టోరేజ్ సమస్యలు ఉండవు. చాలామంది స్టోరేజ్ పూర్తయింది అని అదనపు డబ్బులు చెల్లించి స్పేస్ కొనుగోలు చేస్తారు. అలాంటి ఖర్చు తప్పించుకోవాలంటే—
- నెలకోసారి జీమెయిల్ని ఓపెన్ చేసి
- పాతవి, ఉపయోగం లేని మెయిల్స్ తొలగించడం ద్వారా
గణనీయంగా స్టోరేజ్‌ను ఖాళీ చేసుకోవచ్చు, డబ్బు కూడా ఆదా చేసుకోగలరు.
జీమెయిల్‌ను సరిగ్గా నిర్వహించడం ద్వారా మీరు ఎప్పుడూ స్టోరేజ్ టెన్షన్ లేకుండా సులువుగా వాడుకోగలరు.



