ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు శుభవార్త అందించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాల్లో వార్షిక వడ్డీ మొత్తాన్ని అదనపు చెల్లింపుగా జమ చేయడానికి EPFO సిద్ధమవుతోంది. అయితే ఈ వడ్డీ మొత్తం పూర్తిగా సభ్యుడి ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
సగటున కొంతమంది ఉద్యోగుల ఖాతాల్లో సుమారు రూ.46 వేల వరకు వడ్డీ జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి ఒక్కరి PF ఖాతాలో ఉన్న మొత్తాన్ని బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అధిక బ్యాలెన్స్ ఉన్న సభ్యులకు ఎక్కువ వడ్డీ జమ అవుతుండగా, తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తక్కువ మొత్తమే ఖాతాలోకి వస్తుంది. ఈ వడ్డీ మొత్తం తమ ఖాతాలో జమ అయ్యిందా లేదా అన్న విషయాన్ని సభ్యులు స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన PF బ్యాలెన్స్‌పై EPFO వడ్డీ చెల్లించనుంది. ప్రతి సంవత్సరం EPFO ఒక నిర్దిష్ట వడ్డీ రేటును ప్రకటించి, ఆ రేటు ప్రకారం సభ్యుల డిపాజిట్ మొత్తంపై వడ్డీని జమ చేస్తుంది. ఈ ఏడాది EPFO 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త వడ్డీ రేటుపై సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
EPFO పోర్టల్‌లో PF బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయాలి?
- బ్రౌజర్లో UAN సభ్యుల EPFO అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయాలి
- UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి
- మొబైల్‌కు వచ్చిన OTPని ధృవీకరించాలి
- లాగిన్ అయిన తర్వాత ‘పాస్‌బుక్’ ఆప్షన్‌కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి
- పాస్‌బుక్‌లో మీ PF బ్యాలెన్స్ వివరాలను చూడవచ్చు
ఉమాంగ్ యాప్ ద్వారా EPF పాస్‌బుక్‌ను ఎలా చూడాలి?
- ప్లే స్టోర్ నుంచి UMANG యాప్‌ను డౌన్లోడ్ చేసి లాగిన్ అవ్వాలి
- సెర్చ్‌లో ‘EPFO’ అని టైప్ చేయాలి
- ‘View Passbook’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- మీ UAN నంబర్‌ను నమోదు చేయాలి
- మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి
- సభ్యుల IDని ఎంచుకుని పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవాలి
- పాస్‌బుక్‌లో PF బ్యాలెన్స్‌ను సులభంగా తనిఖీ చేయవచ్చు



