సిలికాన్ వ్యాలీ, జూన్ 7:
నూతన ఆవిష్కరణలకు మరో పేరు ఎలాన్ మస్క్. ట్విట్టర్‌ను “X”గా మలచిన తర్వాత ఆయన తాజా ప్రాజెక్ట్ — XChat — డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో కీలకంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లుగా ఇప్పటికే సుస్థిరంగా నిలిచిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లకు దీటైన ప్రత్యామ్నాయంగా XChatను రంగంలోకి దింపేందుకు మస్క్ సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత డైరెక్ట్ మెసేజింగ్‌కు అప్‌గ్రేడ్
X యాప్‌లో ఇప్పటికే ఉన్న డైరెక్ట్ మెసేజింగ్ వ్యవస్థను ఆధునీకరించి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/వీడియో కాల్స్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించి XChatగా పరిచయం చేశారు. ఇది X యూజర్లకు మరింత సురక్షితంగా, విస్తృతంగా కమ్యూనికేట్ అయ్యే అవకాశం కల్పించనుంది.
ఫోన్ నంబర్ అవసరం లేదు – ఇది మస్క్ మార్క్!
XChat ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి ఫోన్ నంబర్ అవసరం లేదు. ఏ రకమైన ఫైల్ అయినా షేర్ చేసుకోవచ్చునని కంపెనీ పేర్కొంది. మెసేజింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్, ప్రైవేట్, మల్టీ-ఫంక్షనల్‌గా మలచాలన్నదే ఈ ఫీచర్ వెనకున్న ఉద్దేశ్యం.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయమా?
ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న XChat, మొదటగా X సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి రానుంది. యూజర్ ఫ్రీ టైర్‌కి పూర్తిస్థాయి లభ్యత ఇప్పడైతే లేదు. అయినా కూడా, ఇది పూర్తిగా లాంచ్ అయిన తరువాత వాట్సాప్ వంటి ప్రాముఖ్యమైన ప్లాట్‌ఫామ్‌కు గట్టి పోటీగా మారనుందన్నది టెక్నాలజీ విశ్లేషకుల అభిప్రాయం.
మల్టీ పర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా X
XChat రూపంలో ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా మౌలికతను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకే యాప్‌లో మెసేజింగ్, కాలింగ్, షేరింగ్ వంటి సేవలన్నీ సమగ్రంగా ఉండేలా మలచాలన్నదే ఆయన వ్యూహం. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన X ఇప్పుడు మల్టీ పర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా మారుతున్న సంకేతాలు ఇవే.
నిరీక్షణలో ఉన్నవారు – మరికొంత సమయం పట్టే అవకాశం
XChat పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పడే అవకాశముంది. కానీ, మస్క్ టెక్ వ్యూహాల తీరు చూస్తే ఇది టెక్నాలజీ ప్రపంచానికి మరో గేమ్ చేంజర్ అయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.