హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డిసెంబర్ 12న మాధురి పుట్టినరోజు సందర్భంగా మొయినాబాద్‌లోని ది పెండెంట్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీపై ఎస్ఓటీ పోలీసులు అకస్మిక దాడి చేశారు.
అనుమతి లేకుండా మద్యం, హుక్కా పరికరాలు ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో ఈ తనిఖీ జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో పది విదేశీ మద్యం బాటిళ్లు, ఏడు హుక్కా పరికరాలు స్వాధీనం చేసినట్టు ప్రాథమిక సమాచారం చెబుతోంది. ఈ ఘటనతో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారని పోలీసులు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ జంట ఎప్పుడూ చర్చకే కారణమవుతుంటారు. 2024లో దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబం నుంచి వేరై మాధురితో కలిసి జీవించడం ప్రారంభించడంతో వీరి బంధం పెద్ద ఇష్యూ అయ్యింది. అప్పటి నుంచి వారు బహిరంగంగానే కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
ఇటీవల మాధురి బిగ్‌బాస్ 9లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. షోలో మూడు వారాలు ఉండి ఎలిమినేషన్‌కి గురైంది. షో తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


