ప్రధానోపాధ్యాయిని వై.ఫాతిమారాణికి గౌరవ ఆత్మీయ సన్మానం
మంగళగిరి మండలం ఎర్రబాలెంలో గల డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవ సభ ఆదివారం పాఠశాల ఆవరణలో జరిగింది.ఈ సభకు డాన్ బోస్కో పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు,జూబ్లీ వేడుకలకు ఏర్పాటు చేసిన పలు కమిటీల సభ్యులు పాల్గొన్నారు. పది రోజుల క్రితం రాష్ట్ర ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్న డాన్ బోస్కో తెలుగు మీడియం గోల్డెన్ జూబ్లీ ఉత్సవ కార్యక్రమంపై పాఠశాల ప్రధానోపాధ్యాయిని వై.ఫాతిమారాణి,పూర్వ విద్యార్థులు సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల జూబ్లీ వేడుకలకు విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థుల కమిటీ మరియు కార్యక్రమ నిర్వహణకు వేసిన ప్రత్యేక కమిటీ సభ్యులతో పాటు మరికొందరు అధ్యాపకుల తో ఏర్పాటు చేసిన ఈ విజయోత్సవ సభకు రెక్టార్ ఫాధర్ చినబాబు అధ్యక్షతన జరిగింది.డాన్ బోస్కో పూర్వ విద్యార్థులు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, సంఘంలో పూర్వ విద్యార్థుల సభ్యత్వాల విషయం మరియు డాన్ బోస్కో సేవలను పూర్వ విద్యార్థులు సంఘం ద్వారా మరింతగా విస్తరించేలా కార్యక్రమాలు జరిపించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలనే విషయాలను ఈ విజయోత్సవ సభలో పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు.
డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయడంలో ప్రత్యేక దృష్టిపెట్టి ప్రతి విద్యార్థి ఇంటింటికి వెళ్ళి విద్యార్థులను కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించిన ఫాతిమారాణి టీచర్ల బృందాన్ని పలువురు విద్యార్థులు అభినందించగా,డాన్ బోస్కో పూర్వ విద్యార్థులు సంఘం కమిటీ మాజీ అధ్యక్షులు డాక్టర్ బిరుదు రవిబాబు ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని వై.ఫాతిమారాణికి గౌరవ,ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి ఫాతిమారాణి ధన్యవాదములు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఫాదర్స్ కె.యస్,జోసెఫ్, పి.కె జోష్, బల్తాజార్,డాన్ బోస్కో పాఠశాల అధ్యాపక బృందం,డాన్ బోస్కో పూర్వ విద్యార్థులు సంఘం సభ్యులు,కోన శ్రీను,జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం, షేక్ ఖుద్దుస్,పాస్టర్ బి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.



