విజయవాడ: మీడియా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో జర్నలిస్టులు డిజిటల్ మీడియావైపు దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,రచయిత, ఈపూరి రాజారత్నం అన్నారు.కొంతకాలంగా యువత దృష్టిని మీడియా బాగా ఆకర్షించబడుతున్న నేపథ్యంలో యువకులు మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఏదైనా కావచ్చు వాటిలో పనిచేసేందుకు చాలా ఆశక్తిని కనబరుస్తున్నారు. అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు అని రాజారత్నం అన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆలపాటి సురేష్ కుమార్ ని విజయవాడలో గల సి.రాఘవాచారి మీడియా అకాడమీ కార్యాలయంలో గురువారం ఆయన చాంబర్ లో, సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం గౌరవ పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజారత్నం గతంలో తాను రచించిన “జర్నలిజం-జర్నలిస్టులు”(పరిశోధనాత్మక కధనాలు) మొదటి భాగం,మరియు “జర్నలిజం-జర్నలిస్టులు” (జర్నలిజం బేసిక్స్)రెండవ భాగం పుస్తకాలను మీడియా అకాడమీ చైర్మన్ కి అందించారు.
అలాగే రాష్ట్రంలో కొత్త గా జర్నలిజంలోకి వస్తున్న, ప్రస్తుతం జర్నలిస్టులుగా కొనసాగుతున్నవారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చైర్మన్ ఆలపాటి అన్నారు.మరి ముఖ్యంగా గతంలో వలే “ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ” మరియు “ఆచార్య నాగార్జున యూనివర్సిటీ” సంయుక్తంగా నిర్వహించిన ‘డిప్లమో జర్నలిజం’ కోర్సుని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.గతం లో నిర్వహించిన ‘డిప్లమో జర్నలిజం’ కోర్సు పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్ళా పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. ఇందుకుగాను నాగార్జున వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. సింహచలంతో ఇప్పటికే మాట్లాడినట్లు చెప్పారు. వర్సిటీ నుండి అనుమతి రావడంతోనే ముందుగా ‘డిప్లమో జర్నలిజం’ ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆలపాటి తెలిపారు.
“డిప్లమో జర్నలిజం” కోర్సు కొనసాగిస్తాం: ఏ.పి,ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్.
