భారత్‌పై ఆధారపడే దేశాలు – నేపాల్ నుంచి ఖతర్ వరకు భారత్ ప్రాధాన్యం

ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగాల్లో జరుగుతున్న పరిణామాలు గమనార్హంగా ఉన్నాయి. అమెరికాతో సహా అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నాయి. ఆసియా ఖండంలోనూ పరిస్థితులు అంతే క్లిష్టంగా ఉన్నాయి. పొరుగు దేశాల్లో పాలకులు మారుతుండగా, కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్‌ పటిష్టమైన రాజకీయ, ఆర్థిక వ్యవస్థతో ముందంజలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా భారత్‌ తన స్థిరమైన పరిస్థితిని మాత్రమే కాపాడుకోకుండా, అనేక దేశాలకు సహాయం చేస్తూ వాటి ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే భారత్‌ లేకుండా కొన్ని దేశాలు తమ వ్యవస్థలను సజావుగా నడపలేవని చెప్పవచ్చు. ఆ దేశాలపై భారత్‌ ఆధారపడి ఉన్న తీరు ఇలా ఉంది.


నేపాల్ – భారత్‌పై ప్రధానంగా ఆధారపడే దేశం

హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్‌ రాజకీయంగా అస్థిరతను ఎదుర్కొంటోంది. తాజాగా సుశీల కర్కీ ప్రధాని పదవిని చేపట్టారు. నేపాల్‌ అవసరమైన 65% వస్తువులు భారత్‌ నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటిలో ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు, వాహనాలు, టెక్స్టైల్స్ ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షల మంది నేపాలీలు ఉద్యోగాలు, వలసల కోసం భారత్‌కు వస్తారు. ఇరుదేశాల మధ్య వీసా అవసరం లేకపోవడం వల్ల సంబంధాలు మరింత బలపడ్డాయి. 2025లో నేపాల్‌ అభివృద్ధి కోసం భారత్‌ పదివేల కోట్ల రుణం మంజూరు చేసింది.


భూటాన్ – భారత్‌ సహకారంతో ఎదుగుతున్న హిమాలయ దేశం

భూటాన్‌ ఆర్థికంగా భారత్‌పై బలంగా ఆధారపడుతోంది. దాదాపు 70% ఎగుమతులు భారత్‌ నుంచే వస్తాయి. ముఖ్యంగా హైడ్రోపవర్‌ ప్రాజెక్టులకు భారత్‌ విశేష సాయం చేస్తోంది. రోడ్లు, భవనాల నిర్మాణం, విద్యుత్‌ ప్రాజెక్టుల అభివృద్ధిలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంధనం, ఔషధాలు, ఆటోమొబైళ్లు భారత్‌ నుంచే సరఫరా అవుతాయి. చైనాతో వివాదం వచ్చిన సందర్భాల్లో భారత్‌ సైనికంగా కూడా భూటాన్‌కు అండగా నిలుస్తోంది.


మాల్దీవులు – పర్యాటక దేశం, కానీ ఆహార అవసరాలకు భారత్‌పై ఆధారం

మాల్దీవులు పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన దేశం అయినప్పటికీ, వ్యవసాయం లేకపోవడంతో ఆహార వస్తువులన్నీ భారత్‌పై ఆధారపడుతుంది. పర్యాటకులలో కూడా భారతీయులే అధికం. గతంలో భారత్‌తో ఉద్రిక్తతలు ఏర్పడినా, చివరికి మాల్దీవులు సంబంధాలను సవ్యంగా కొనసాగించాల్సి వచ్చింది. 2020లో సైక్లోన్‌ దెబ్బతినగా, భారత్‌ 400 మిలియన్లతో మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం చేపట్టింది.


శ్రీలంక – ఆర్థిక సంక్షోభంలో భారత్‌ అండ

భారత్‌ దక్షిణాన ఉన్న శ్రీలంక గత దశాబ్దంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో ఏ దేశమూ ముందుకు రాకపోయినా, భారత్‌ నాలుగు బిలియన్ల డాలర్ల సాయం అందించింది. ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాల సరఫరాతో పాటు పునర్వాసం ఏర్పాట్లలోనూ భారత్‌ కీలక పాత్ర పోషించింది.


ఖతర్ – ధనిక దేశం అయినా ఆహార సరఫరాకు భారత్‌పై ఆధారపడుతున్నది

ఖతర్‌ ఫ్యూయల్‌ రిసోర్సులతో సంపన్న దేశం అయినప్పటికీ, ఆహార పదార్థాల్లో భారత్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. ప్రతి సంవత్సరం ఖతర్‌ ఆహార అవసరాలలో 25% వరకు భారత్‌ నుంచే సరఫరా అవుతుంది. ధనిక దేశం అయినా వ్యవసాయ పరంగా బలహీనత ఉండటంతో భారత్‌ సహకారం కీలకంగా మారింది.


ముగింపు

ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగాల్లో భారత్‌ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. పొరుగున ఉన్న చిన్న దేశాల నుంచి గల్ఫ్‌ దేశాల వరకు భారత్‌పై ఆధారపడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది భారత ఆర్థిక శక్తి, దౌత్యపరమైన ప్రభావాన్ని చాటుతుంది. రాబోయే రోజుల్లో భారత్‌ సహకారం లేకుండా అనేక దేశాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి