మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ ఘనంగా విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ఈరోజు తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు చిత్ర నిర్మాతలు హాజరై సినిమాపై అంచనాలను మరింత పెంచారు.
సుమారు 2 నిమిషాల 40 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్‌లో చిరంజీవి తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. స్టైలిష్ లుక్‌లో కనిపించిన మెగాస్టార్, ‘వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్’ అన్న ఫీలింగ్‌ను మరోసారి కలిగించారు. ముఖ్యంగా చిరంజీవి–నయనతార మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. చివర్లో చిరంజీవి–వెంకటేశ్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. మొత్తం మీద ఈ ట్రైలర్ మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర యూనిట్ వరుసగా 9 రోజుల నాన్‌స్టాప్ ప్రమోషన్ టూర్ ప్రారంభించనుంది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, అనంతపురం, వరంగల్, బెంగళూరు వంటి నగరాల్లో ఈ టూర్ కొనసాగనుంది. ఇప్పటికే రాజమండ్రిలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమానికి మంచి స్పందన రావడం గమనార్హం.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు మరింత ప్లస్‌గా నిలుస్తోంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ కూడా జనవరి 9న విడుదలకు సిద్ధమవడంతో, ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ గట్టిగానే ఉండనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



