చంద్రబాబు హెచ్చరిక: పార్టీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలకు టాటా చెప్పేదే!

chandrababu-warning-to-tdp-mlas-who-miss-party-meetings

అమరావతి:
తెలుగుదేశం పార్టీని మరింత శ్రద్ధతో నడిపేందుకు నేతల కట్టుబాటును కీలకంగా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్న నాయకులకు ఇకపై “టాటా బైబై” చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.

రెండో తేదీ నుంచి టీడీపీ చేపట్టనున్న పాలనలో విజయాల ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించారు. కానీ ఈ సమావేశానికి దాదాపు 50 మంది హాజరుకాలేదు. ఇందులో 15 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొంతమంది కేవలం హాజరు సంతకం చేసి వెళ్లగా, మరికొంతమంది కొద్ది నిమిషాలు మాత్రమే పాల్గొన్నారు.

ఇటువంటి వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, వారి జాబితాను స్వయంగా సేకరించి సమావేశ ముగింపులో స్పష్టమైన సందేశం ఇచ్చారు. కొంత మంది “గుడులకు వెళ్లాం”, మరికొంత మంది “విదేశీ పర్యటనలకు వెళ్లాం” అనే వివరాలను చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు.

“పార్టీ కార్యక్రమాల కంటే ఇతర అంశాలు ముఖ్యమని భావిస్తే, వారు తమ దారిన వెళ్లొచ్చు” అని హెచ్చరించారు. విదేశీ పర్యటనల పేరుతో ఎన్ఆర్‌ఐ సభలు, టాటా–నాటా సమావేశాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిపైనా ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు.

పార్టీ కార్యకలాపాల పట్ల అసాధారణంగా అలసత్వం చూపే నేతలను ఇకనైనా బుద్ధి చెప్పాల్సిందేనని, ప్రజలకు అందుబాటులో లేని నాయకులకు ఇక పార్టీ వద్ద అవకాశమే లేదని చంద్రబాబు వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. “ఇప్పుడైతే ఒక్క ఏడాది గడిచింది. కనుక హెచ్చరికల పరంగా వ్యవహరిస్తున్నాం. కానీ ఇకపై అలాంటి వారిపై ఒత్తిడి చేసినా ప్రయోజనం ఉండదు” అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి