బుద్ధుని తలపై నత్తల కథ వెనక ఉన్న అసలైన సత్యం! అద్భుతమైన ధ్యానం కోసం అమరమైన త్యాగం

buddha-head-snails-sacrifice-story-truth

గౌతమ బుద్ధుడు — బౌద్ధ మతాన్ని స్థాపించి మానవాళికి శాంతి, జ్ఞాన మార్గాన్ని చూపించిన మహానుభావుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం ప్రాంతంలో శాక్య క్షత్రియ వంశంలో, లుంబినీ (ఇప్పటి నేపాల్)లో జన్మించాడు. తల్లి పేరు మాయాదేవి, తండ్రి పేరు శుద్ధోదనుడు. రాజకుటుంబానికి చెందినవాడు కావడంతో అన్ని సౌకర్యాల మధ్య జీవించాడు. 15వ యేట యశోధరను వివాహం చేసుకుని, వారికి రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. బుద్ధుడు తాను నైపుణ్యం కలిగిన మార్షల్ ఆర్ట్స్‌ను కూడా తన కుమారుడికి నేర్పాడు.

అయితే, జీవితం లోని నిజమైన అర్థం తెలుసుకోవాలనే తపనతో బుద్ధుడు 29వ యేట రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలి, సన్యాసం తీసుకున్నాడు. కఠినమైన తపస్సు అనంతరం, 35వ యేట ప్రస్తుత బీహార్‌లోని బుద్ధ గయలో భోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. అప్పటినుండి ఆయన బుద్ధుడిగా గుర్తింపుపొందాడు.

ఇక బుద్ధుని విగ్రహాల్లో, చిత్రాల్లో ఆయన తలపై కనిపించే వాకర్‌లాంటి వలయాల జుట్టు చాలామందిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇది నిజానికి జుట్టు కాదని, నత్తలు అన్న మాట తెలుసా?

చరిత్ర ప్రకారం, ఒక రోజు మధ్యాహ్న వేళ గౌతమ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో లీనమయ్యారు. ఎండ క్రమంగా పెరిగి, సూర్యకిరణాలు నేరుగా ఆయన తలపై పడుతున్నా ఆయన ధ్యానాన్ని ఆపలేదు. ఆ సమయంలో అటుగా వెళ్లిన ఓ నత్త ఈ దృశ్యాన్ని గమనించి, బుద్ధుడి తలపైకి ఎక్కింది. ఆమెను అనుసరిస్తూ మరిన్ని నత్తలు వచ్చి ఆయన తలపై కూర్చొని చల్లదనం అందించాయి, తద్వారా ఆయన ధ్యానానికి భంగం రాకుండా చేశాయి.

గంటల పాటు సూర్యకిరణాల వేడిని తట్టుకోలేక ఆ నత్తలు అక్కడికక్కడే చనిపోయాయి. ధ్యానం ముగిసిన అనంతరం బుద్ధుడు ఈ త్యాగాన్ని గుర్తించి, ఆ నత్తల జ్ఞాపకార్థంగా తలపై వాటిని ప్రతిష్టించాడు. అందుకే ఇప్పటికీ బుద్ధుని విగ్రహాల్లో తలపై నత్తల ఆకారంలో వలయాలుగా చూపిస్తారు.

ఈ కథ బుద్ధుని ధ్యానం వెనక ఉన్న ఓ నిశ్శబ్ద త్యాగాన్ని, మనిషి జీవితంలో జీవరాశుల అనుకంపను ఎంతగానో ప్రాధాన్యతనిచ్చే విషయాన్ని సూచిస్తుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి