బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగం కోరుకునే వారికి శుభవార్త. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలోని బీఎస్ఎఫ్.. స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక జరగనుండటం విశేషం. దరఖాస్తుకు గడువు దగ్గరపడుతుండటంతో ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేయాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 549 కానిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
- పురుషులు: 277 పోస్టులు
- మహిళలు: 272 పోస్టులు
ఈ పోస్టులు పూర్తిగా స్పోర్ట్స్ కోటా కిందనే భర్తీ కానున్నాయి.
విద్యార్హత & క్రీడా అర్హత
అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గత రెండేళ్లలో క్రీడల్లో ప్రతిభ చూపి ఉండాలి. అర్హత కలిగిన క్రీడలు ఇవి:
అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, హాకీ, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్, ఉషు తదితరాలు.
- అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి మొదటి ప్రాధాన్యం
- జాతీయ స్థాయిలో పతకాలు లేదా పాల్గొన్న వారికి రెండో ప్రాధాన్యం
ఫిజికల్ స్టాండర్డ్స్
- పురుషులు: ఎత్తు 170 సెం.మీ, ఛాతీ 80 సెం.మీ (శ్వాస తీసుకున్నప్పుడు 5 సెం.మీ విస్తరణ)
- మహిళలు: ఎత్తు 157 సెం.మీ
- ఎస్టీ అభ్యర్థులకు ఎత్తు, ఛాతీలో నోటిఫికేషన్ ప్రకారం సడలింపులు వర్తిస్తాయి
- ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండాలి
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు
- ఓబీసీలకు 3 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది
దరఖాస్తు విధానం & ఫీజు
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- చివరి తేదీ: జనవరి 1, 2026
- దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులు: రూ.159
- ఎస్సీ, ఎస్టీ, మహిళలు: ఫీజు లేదు
ఎంపిక విధానం
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- క్రీడా ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్
ఈ రెండు దశల ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం చెల్లిస్తారు.


