ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే కలిగే 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సహజ ఔషధం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. చర్మానికి సహజమైన మెరుపు రావడం నుంచి రోగనిరోధక శక్తి పెరగడం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మన వంటకాలలో కూడా నిమ్మ అనేది విడదీయరాని భాగం. ముఖ్యంగా పులిహోర వంటి వంటకాల్లో నిమ్మ లేకపోతే రుచే ఉండదు. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా నిమ్మలో పుష్కలంగా ఉన్నాయి.

రోజువారీ జీవితంలో నిమ్మరసం ఉపయోగం

విటమిన్ C, ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండే నిమ్మరసం తక్కువ కేలరీలు కలిగిన ఆరోగ్యకరమైన పానీయం. రోజూ నిమ్మరసం లేదా నీంబూ పానీ తాగడం వల్ల శరీరానికి తగినంత ద్రవాలు అందుతాయి. డీహైడ్రేషన్ సమస్య అన్ని వయసుల వారిలో సాధారణం. నిపుణుల సూచన ప్రకారం మహిళలు రోజుకు సుమారు 2.7 లీటర్ల నీటిని, పురుషులు 3.7 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో నిమ్మరసం కలిపితే తాగడానికి మరింత ఆసక్తి కలుగుతుంది.

ప్రతిరోజూ నిమ్మరసం తాగితే కలిగే లాభాలు

నిమ్మ విటమిన్ C కి మంచి వనరు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మరసం కలిపితే రోజువారీ విటమిన్ C అవసరంలో మంచి భాగం లభిస్తుంది.
నిమ్మలో ఉండే పెక్టిన్ ఫైబర్ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో అనవసరమైన తీపి పదార్థాల పట్ల కోరిక తగ్గుతుంది. సోడా, తీపి డ్రింక్స్‌కి బదులుగా నిమ్మరసం తాగడం వల్ల కేలరీలు తగ్గుతాయి.
విటమిన్ C చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముడతలు పడకుండా, ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియకు, శరీర శుద్ధికి మేలు

నిమ్మరసం శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో దోహదం చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. నిమ్మరసం కడుపులోని ఆమ్లత్వాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడటంతో గుండెల్లో మంట తగ్గుతుంది.

నోటి దుర్వాసన, కిడ్నీ రాళ్ల నివారణ

నోటి దుర్వాసన ఉన్నవారు ఉదయం లేదా భోజనం తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం మంచిది. ఇది నోరు పొడిబారకుండా చేసి లాలాజలాన్ని పెంచుతుంది.
నిమ్మలో ఉండే సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. చిన్న రాళ్లు ఉంటే అవి సులభంగా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి