హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలు రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ పండుగ

తెలంగాణ సాంస్కృతిక ఆభరణం బతుకమ్మ పండుగ మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన ఘనమైన బతుకమ్మ సంబరాలు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి.

ఈ వేడుకలో భాగంగా 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. అదేవిధంగా, ఒకేసారి 1354 మంది మహిళలు కలిసి బతుకమ్మ ఆడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీని ఫలితంగా బతుకమ్మ ఉత్సవం “అతిపెద్ద జానపద నృత్యం” మరియు “అతిపెద్ద బతుకమ్మ” కేటగిరీలలో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.

సోమవారం జరిగిన ఈ చారిత్రక వేడుకలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా బతుకమ్మ పాట పాడి మహిళలను, అక్కడికొచ్చిన జనాన్ని అలరించారు.

ఈ విజయంతో తెలంగాణ బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతూ, రాష్ట్ర గర్వకారణంగా నిలిచింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి