Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2026 సంవత్సరానికి గాను భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది.

ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11, తెలంగాణ రాష్ట్రానికి 17 ఖాళీలను కేటాయించారు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

దరఖాస్తు తేదీలు ఇవే

అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 15, 2026 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ జనవరి 25, 2026గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటించింది.

అర్హతలు ఏమిటంటే?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా పని అనుభవం కూడా ఉండాలి.

వయో పరిమితి వివరాలు

  • అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు
  • పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ఠంగా 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది

ఎంపిక విధానం ఇలా ఉంటుంది

ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి తుది ఎంపిక చేస్తారు. ఇది రాత పరీక్ష భయం లేకుండా బ్యాంక్ ఉద్యోగం పొందాలనుకునే వారికి పెద్ద ప్లస్ పాయింట్.

స్టైపెండ్ ఎంతంటే?

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,300 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే డిగ్రీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి