ఆగష్టు 30 శనివారం రాశి ఫలాలు – ఈ రోజు మీ అదృష్టం ఏమిటో తెలుసుకోండి

చాంద్రమానాన్ని అనుసరించి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏవిధమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

తిథి, నక్షత్రాలు:
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – భాద్రపద మాసం – సప్తమి తిథి రా. 10:45 వరకు, అనంతరం అష్టమి.
నక్షత్రం: విశాఖ మ. 2:29 వరకు, తరువాత అనురాధ.
వర్జ్యం: రా. 7:05 నుండి 8:52 వరకు.
రాహుకాలం: ఉ. 9:11 నుండి 10:43 వరకు.


♈ మేషరాశి

చంద్రబలం అనుకూలంగా ఉన్నా తొందరపాటు నిర్ణయాలు తప్పించుకోండి. ఆర్థిక లాభాలు ఉన్నా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. శివారాధన శుభఫలితాలు ఇస్తుంది.
అదృష్ట సంఖ్య: 06
అదృష్ట రంగు: తెలుపు

♉ వృషభరాశి

ఆర్థిక సమస్యలు తీరే సూచనలు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. విష్ణు సహస్రనామాలు జపించండి.
అదృష్ట సంఖ్య: 09
అదృష్ట రంగు: పసుపు

♊ మిథునరాశి

గ్రహబలం అంతగా అనుకూలం కాదు. వాగ్వాదాలను నివారించండి. కుటుంబంతో విందు వినోదాలు జరుగుతాయి. ఖర్చులు అదుపులో పెట్టాలి. ఉద్యోగులకు అనుకూలం. వినాయకుడికి గరికపూజ శ్రేయస్సు ఇస్తుంది.
అదృష్ట సంఖ్య: 03
అదృష్ట రంగు: లేత నీలం

♋ కర్కాటకరాశి

చంద్రబలం కొంత తగ్గినా ఆర్థిక స్థితి బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషం. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. ఊహాజనిత పెట్టుబడులు తప్పించండి. పంచముఖి ఆంజనేయ ఆరాధన శుభం ఇస్తుంది.
అదృష్ట సంఖ్య: 05
అదృష్ట రంగు: పచ్చ

♌ సింహరాశి

గ్రహబలం అనుకూలం. ఆస్తి వివాదాలను నివారించండి. మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు, హామీలు వద్దు. విద్యార్థులకు సాధారణ రోజు. వెంకటేశ్వరస్వామి ఆరాధన ఫలప్రదం.
అదృష్ట సంఖ్య: 09
అదృష్ట రంగు: పసుపు

♍ కన్యారాశి

ఆర్థికంగా బలమైన రోజు. మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులకు శుభ సమయం. తొందరపాటు నిర్ణయాలు సమస్యలు కలిగిస్తాయి. గణపతికి బెల్లం, కుడుములు సమర్పించండి.
అదృష్ట సంఖ్య: 11
అదృష్ట రంగు: తెలుపు

♎ తులారాశి

రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, పాత పెట్టుబడులు ప్రయోజనం తెస్తాయి. కొత్త భాగస్వామ్యాల్లో జాగ్రత్త. విద్యార్థులకు అద్భుతమైన రోజు. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్సు ఇస్తుంది.
అదృష్ట సంఖ్య: 06
అదృష్ట రంగు: ఎరుపు

♏ వృశ్చికరాశి

గ్రహబలం మిశ్రమం. తలపెట్టిన పనులు పూర్తయ్యే అవకాశముంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరిగే సూచనలు. పెట్టుబడులకు అనుకూలం కాదు. హనుమంతుడికి ఆకుపూజ శుభం ఇస్తుంది.
అదృష్ట సంఖ్య: 05
అదృష్ట రంగు: కాషాయం

♐ ధనూరాశి

చంద్రబలం బాగుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పెట్టుబడులకు, కొత్త వ్యాపారాలకు శుభ కాలం. విద్యార్థులు కష్టపడాలి. విష్ణు సహస్రనామ జపం మేలును ఇస్తుంది.
అదృష్ట సంఖ్య: 07
అదృష్ట రంగు: లేత పసుపు

♑ మకరరాశి

గ్రహబలం అద్భుతంగా ఉంది. డబ్బు రాకలు పెరుగుతాయి. వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వారికి లాభదాయకమైన రోజు. దూరప్రయాణాలు శ్రేయస్సు ఇస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి శుభదినం. ఈశ్వరారాధన శుభఫలితాలను ఇస్తుంది.
అదృష్ట సంఖ్య: 07
అదృష్ట రంగు: బంగారు వర్ణం

♒ కుంభరాశి

ఉద్యోగులకు పనిలో ఒత్తిడి. జీవిత భాగస్వామి సలహాతోనే నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారులకు ధనకష్టాలు ఉండే సూచనలు. రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అనుకూలం. దత్తాత్రేయ ఆరాధన ఫలప్రదం.
అదృష్ట సంఖ్య: 05
అదృష్ట రంగు: నీలం

♓ మీనరాశి

చంద్రబలం తక్కువ. వ్యాపారాల్లో ఆటంకాలు వస్తాయి. దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లల చదువులపై శ్రద్ధ అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. సీతారామచంద్రారాధన ఇబ్బందులు తొలగిస్తుంది.
అదృష్ట సంఖ్య: 09
అదృష్ట రంగు: పసుపు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి