ఒకప్పుడు గల్లీ గల్లీకి కనిపించిన ఏటీఎంలు ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన FY25 కీలక నివేదికలో వెల్లడైంది. డిజిటల్ చెల్లింపుల విస్తరణే ఇందుకు ప్రధాన కారణమని ఆర్బీఐ స్పష్టం చేసింది.
RBI నివేదికలో ఏముంది?
“భారతదేశంలో బ్యాంకింగ్ ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ 2024–25” పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం ఏటీఎంల సంఖ్య తగ్గింది. నగదు వినియోగం తగ్గిపోవడం, యూపీఐ, కార్డులు, ఆన్లైన్ చెల్లింపులపై ప్రజల ఆధారపడటం పెరగడం వల్ల ఏటీఎంల అవసరం తగ్గిందని ఆర్బీఐ పేర్కొంది.
ఎంత మేరకు తగ్గిన ఏటీఎంల సంఖ్య?
- మార్చి 31, 2025 నాటికి దేశంలో మొత్తం ఏటీఎంల సంఖ్య: 2,51,057
- గత సంవత్సరం ఇదే సమయంలో: 2,53,417
ఒకే ఏడాదిలో సుమారు 2,360 ఏటీఎంలు తగ్గాయి.
ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ప్రైవేట్ బ్యాంకులు ఆఫ్‌సైట్ ఏటీఎంలను మూసివేయడాన్ని ఆర్బీఐ పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంల పరిస్థితి
- ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు
గత సంవత్సరం: 79,884
FY25లో: 77,117 - ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు
గత సంవత్సరం: 1,34,694
FY25లో: 1,33,544
ప్రభుత్వ, ప్రైవేట్ రెండింటిలోనూ ఏటీఎంల సంఖ్య తగ్గినట్లు నివేదిక స్పష్టం చేసింది.
పెరుగుతున్న వైట్ లేబుల్ ఏటీఎంలు
ఏటీఎంల మొత్తం సంఖ్య తగ్గినా, వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య మాత్రం పెరిగింది.
- మార్చి 31, 2024: 34,602
- మార్చి 31, 2025: 36,216
గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో బ్యాంకుల స్థానంలో ఈ వైట్ లేబుల్ ఏటీఎంలు కీలకంగా మారుతున్నాయి.
ఏటీఎంల భౌగోళిక పంపిణీ ఇలా ఉంది
- ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్, మెట్రో ప్రాంతాల్లో దాదాపు సమానంగా ఉన్నాయి
- ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ఏటీఎంలు ప్రధానంగా పట్టణ, మెట్రో నగరాల్లోనే కేంద్రీకృతమయ్యాయి
ఏటీఎంలు తగ్గినా బ్యాంకు శాఖలు పెరుగుతున్నాయి
ఆశ్చర్యకరంగా, ఏటీఎంల సంఖ్య తగ్గుతున్నా బ్యాంకు శాఖల సంఖ్య మాత్రం పెరుగుతోంది.
- మార్చి 31, 2025 నాటికి మొత్తం బ్యాంకు శాఖలు: 1.64 లక్షలు
- వార్షిక వృద్ధి: 2.8 శాతం
ఈ కొత్త శాఖల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ రంగ బ్యాంకులవే.
గ్రామీణ ప్రాంతాలపై పీఎస్‌బీల ఫోకస్
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రారంభించిన కొత్త శాఖల్లో రెండు వంతులకుపైగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
అయితే ప్రైవేట్ బ్యాంకుల విషయంలో ఈ వాటా కేవలం 37.5 శాతం మాత్రమేనని ఆర్బీఐ తెలిపింది.
బేసిక్ సేవింగ్స్ ఖాతాలు పెరుగుతున్నాయి
- BSBDA ఖాతాల సంఖ్య: 724 మిలియన్లు
- వృద్ధి: 2.6 శాతం
- మొత్తం డిపాజిట్లు: రూ.3.3 లక్షల కోట్లు
ఈ ఖాతాల్లో ఎక్కువ భాగం బిజినెస్ కరస్పాండెంట్ మోడల్ ద్వారా నిర్వహించబడుతున్నాయని నివేదిక పేర్కొంది.
డిపాజిట్ బీమా పరిస్థితి
- ఖాతాల సంఖ్య పరంగా బీమా కవరేజ్: 97.6 శాతం
- డిపాజిట్ మొత్తంపై కవరేజ్: 41.5 శాతం
గత ఏడాదితో పోలిస్తే డిపాజిట్ విలువ ఆధారిత కవరేజ్ స్వల్పంగా తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది.



