ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వంలో కదలికలు.

ap-journalists-house-plots-cm-chandrababu-decision

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ మంచి శుభవార్త చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వాల‌ని సిఎం చంద్ర‌ బాబు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రెవిన్యూ శాఖ స‌మీక్ష‌ సమావేశంలో సిఎం చంద్ర‌బాబు ఈ ప్ర‌క‌ట‌న‌ చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల విషయమై సీఎం చంద్రబాబు సూచనల మేరకు ముగ్గురు మంత్రుల‌తో త్వరలో మంత్రివ‌ర్గ ఉప‌ సంఘం ఏర్పాటు చేయనున్నారు.ఇందులో రాష్ట్ర మంత్రులైన రెవిన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ ప్ర‌సాద్,హౌసింగ్&సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సార‌ధి,మున్సిపల్&పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయ‌ణ‌ల‌తో ఈ ఉపసంఘం ఏర్పాటు కానున్నది.ఈ క్రమంలో త్వ‌ర‌లో మంత్రుల ఉపసంఘం భేటీ కానున్నట్లు సమాచారం.

శుక్రవారం అమరావతిలో ని వెలగపూడి సచివాలయంలో జరిగిన రెవిన్యూ శాఖ సమీక్షసమావేశంలో సీఎం చంద్రబాబు నుండి వెలువడిన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు పై రాష్ట్రంలో జర్నలిస్టులు, ఆయా ప్రెస్ క్లబ్ నిర్వాహకులు,పలు ప్రాంతాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 20ఏళ్లకు పైబడి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఇది అమలు కావడం లేదని పలువురు జర్నలిస్టుల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక జనరేషన్ జర్నలిస్టులు ప్రభుత్వం ఇచ్చే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలు సాధించలేక అనా రోగ్యాలతో అర్దాంతరంగా జర్నలిజం వీడిపోయారని ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని కనీసం ఇంటి స్థలం అయినా అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి