ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుండి ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగనున్నాయి.
అదేవిధంగా, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 2026 జనవరి 23న జరగనుంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి 10 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీలు – 2026
మొదటి సంవత్సరం పరీక్షలు:
- ఫిబ్రవరి 23 – 2nd లాంగ్వేజ్ పేపర్ – I
- ఫిబ్రవరి 25 – ఇంగ్లీష్ పేపర్ – I
- ఫిబ్రవరి 27 – హిస్టరీ పేపర్ – I
- మార్చి 2 – మ్యాథ్స్ పేపర్ – IA
- మార్చి 5 – జూలాజీ / మ్యాథ్స్ – IB
- మార్చి 7 – ఎకనామిక్స్ – I
- మార్చి 10 – ఫిజిక్స్ – I
- మార్చి 12 – కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – I
- మార్చి 14 – సివిక్స్ – I
- మార్చి 17 – కెమిస్ట్రీ – I
- మార్చి 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – I
- మార్చి 24 – మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – I
రెండో సంవత్సరం పరీక్షలు:
- ఫిబ్రవరి 24 – 2nd లాంగ్వేజ్ పేపర్ – II
- ఫిబ్రవరి 26 – ఇంగ్లీష్ పేపర్ – II
- ఫిబ్రవరి 28 – హిస్టరీ / బోటనీ పేపర్ – II
- మార్చి 3 – మ్యాథ్స్ పేపర్ – IIA / సివిక్స్ – II
- మార్చి 6 – జూలాజీ – II / ఎకనామిక్స్ – II
- మార్చి 9 – మ్యాథ్స్ పేపర్ – IIB
- మార్చి 11 – ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – II
- మార్చి 13 – ఫిజిక్స్ – II
- మార్చి 16 – మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – II
- మార్చి 18 – కెమిస్ట్రీ – II
- మార్చి 23 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – II
ప్రత్యేక గమనికలు
- ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
- విద్యార్థులు హాల్‌టికెట్లు పరీక్షలకు తప్పనిసరిగా తీసుకురావాలి.
- ప్రాక్టికల్స్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల పరీక్షలు జరుగుతాయి.
ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు సన్నద్ధం కావాలని, సమయపట్టికను అనుసరించి చదువులు కొనసాగించాలని ఇంటర్ బోర్డు సూచించింది.



