ఏపీ దివ్యాంగులకు శుభవార్త – ఉచిత త్రిచక్ర మోటారు వాహనాల పథకం ప్రారంభం

కూటమి ప్రభుత్వ మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తూ వేగంగా ముందుకు సాగుతోంది. సూపర్ సిక్స్ పథకంతోపాటు ప్రజలకు నేరుగా ఉపయుక్తమయ్యే పథకాలను ప్రవేశపెడుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించే నిర్ణయం తీసుకుంది.

ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ గిఫ్టెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ (APDASCAC) విడుదల చేసింది. అర్హులు అక్టోబర్ 31 లోపు www.apdascac.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు

ఈ పథకానికి అర్హత సాధించడానికి ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. అవి:

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.

2. వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. 70 శాతం కంటే ఎక్కువ శారీరక వైకల్యం కలిగి ఉండాలి.

4. కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత తప్పనిసరి.

5. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి.

6. ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

7. ఇప్పటికే ఈ పథకం ద్వారా వాహనం పొందిన వారు మళ్లీ అర్హులు కారు.

8. సొంత వాహనం కలిగి ఉండకూడదు.

అవసరమైన పత్రాలు

దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు:

ఆధార్ కార్డు

జిల్లా వైద్య బోర్డు జారీ చేసిన వికలాంగ ధృవీకరణ పత్రం

10వ తరగతి సర్టిఫికేట్

SC, ST అభ్యర్థులైతే కుల ధృవీకరణ పత్రం

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

01-01-2022 తర్వాత జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం

విద్యార్థులైతే బోనఫైడ్ సర్టిఫికేట్

ముందుగా వాహనం తీసుకోలేదని, ఇచ్చిన సమాచారం సరిగానే ఉందని స్వీయ ప్రకటన

రిజర్వేషన్ వివరాలు

మహిళలు – 50%

పురుషులు – 50%

SC – 16%

ST – 7%

జనరల్ – 77%

ప్రాధాన్యత పొందేవారు

1. పీజీ చదువుతున్న విద్యార్థులు

2. స్వీయ ఉపాధి లేదా వేతనం పొందుతున్న డిగ్రీ హోల్డర్లు

దరఖాస్తు విధానం & చివరి తేదీ

అర్హత కలిగిన వారు  http://www.apdascac.ap.gov.in  వెబ్‌సైట్‌లో అక్టోబర్ 31 లోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి త్రిచక్ర మోటారు వాహనాలను ఉచితంగా అందిస్తుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి