ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త అందింది. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హెక్టారుకు రూ.50 వేల చొప్పున సహాయం అందించనుంది. ఫలితంగా కర్నూలు, కడప జిల్లాల్లోని 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
ఈ ఆర్థిక సహాయం ఈ-పంట ఆధారంగా అందజేయబడనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు నేరుగా ప్రయోజనం లభించనుంది.
ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. వారిని రక్షించేందుకు ముందుకు వచ్చింది. మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్ ఇప్పటికే కీలక పాత్ర పోషించాయి. క్వింటాల్ ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేసి, మొత్తం రూ.18 కోట్లు వెచ్చించాయి. వీటిలో రూ.10 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగతా రూ.8 కోట్లు కూడా త్వరలో అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఈసారి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఉల్లి ధరలు క్వింటాకు రూ.600 కంటే ఎక్కువగా లభించలేదు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 చొప్పున సుమారు 1.39 లక్షల క్వింటాళ్ల ఉల్లిని సేకరించింది. కర్నూలు మార్కెట్ యార్డ్‌లోకి వచ్చిన ఉల్లిని మొత్తం సేకరించి, కొంతమందికి రైతు బజార్లు, వ్యాపారుల ద్వారా విక్రయించే అవకాశం కల్పించింది.
అయినా కొంతమంది రైతుల వద్ద ఉల్లి నిల్వలుగా మిగిలినట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఆ రైతుల నష్టాలను సమీక్షించి హెక్టారుకు రూ.50 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో సాయం నేరుగా జమ కానుంది. ఈ చర్యతో రైతులు కొంత ఊరట పొందనున్నారు.
- కొచ్చిన్ షిప్‌యార్డ్ ఉద్యోగాలు 2026: 260 వర్క్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 2026 సంవత్సరానికి 260 ఒప్పంద వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 7, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, వయస్సు, వేతనం, ఎంపిక విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి.
- పొదుపు ఖాతా లావాదేవీలు… ఆదాయపు పన్ను నోటీసుకు దారితీయవచ్చా? ఇవి తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
మీ పొదుపు ఖాతా లావాదేవీలు ఆదాయపు పన్ను శాఖ నిఘాలో ఉన్నాయా? భారీ డిపాజిట్లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, విదేశీ లావాదేవీల వల్ల నోటీసు రావడానికి 10 కారణాలు తెలుసుకోండి.
- ఘజియాబాద్‌లో దారుణం: హైరైజ్ అపార్ట్మెంట్ నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో హైరైజ్ అపార్ట్మెంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. కుటుంబ ఆర్థిక సంక్షోభం, మొబైల్ అడిక్షన్ నేపథ్యంగా పోలీసులు విచారణ చేపట్టారు.
- షుగర్ కంట్రోల్ చేయాలంటే బాదం ఆకులు.. మధుమేహానికి సహజ పరిష్కారం
షుగర్‌తో బాధపడుతున్నారా? బాదం ఆకులు మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తాయో తెలుసుకోండి. వాడే విధానం, ఆరోగ్య ప్రయోజనాలు, ఇతర ఆకుల వివరాలు పూర్తి సమాచారం.
- రాశిఫలాలు 5 ఫిబ్రవరి 2026 (గురువారం): గురుగ్రహ ప్రభావంతో జ్ఞానం, అభివృద్ధి, శుభ నిర్ణయాలు
రాశిఫలాలు 5 ఫిబ్రవరి 2026 గురువారం: ఈరోజు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం ఎలా ఉంటాయో తెలుసుకోండి. మేషం నుంచి మీన రాశుల వరకు పూర్తి రాశిఫలాలు తెలుగులో చదవండి.
SEO Tags:



