ఏపీ పాఠశాలల్లో 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం – SA, SGT పోస్టులు, వేతనాలు, గైడ్‌లైన్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా కొనసాగుతున్న ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామక విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,146 పోస్టుల భర్తీకి అనుమతి మంగళవారం ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నియామకాల్లో స్కూల్ అసిస్టెంట్లు (SA), సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) రెండు వర్గాలు ఉన్నాయి.

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గతంలో రెగ్యులర్ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వాలంటీర్స్ను తీసుకుని బోధన నిర్వహించిన విధానం కొంతకాలంగా నిలిచిపోయింది. తాజా పరిస్థితుల దృష్ట్యా అదే వ్యవస్థను ‘అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్’ పేరిట పునరుద్ధరించింది. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీ ద్వారా భారీ సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించినా, ఇంకా ఖాళీలుండటంతో ఈ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం పోస్టుల సంఖ్య – వేతనాలు

పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం:

మొత్తం పోస్టులు – 1,146

  • స్కూల్ అసిస్టెంట్లు (SA): 892 పోస్టులు
  • SGTలు: 254 పోస్టులు

నెలవారీ పారితోషికం

  • స్కూల్ అసిస్టెంట్ (SA): ₹12,500
  • SGT: ₹10,000

విధుల్లో ఉండే కాలం – ఐదు నెలలు మాత్రమే

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు డిసెంబర్ 8 నుంచి మే 7 వరకు విధుల్లో ఉంటారు. అనంతరం వీరి ఒప్పందం ఆటోమేటిక్‌గా ముగుస్తుందని శాఖ స్పష్టం చేసింది. ఈ నియామకాలకు సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నుంచి ₹8.21 కోట్లు కేటాయించారు.

హిందీ, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ పోస్టులు

నియామకాల్లో అధికంగా ఖాళీలు ఉన్న సబ్జెక్టులు:

  • హిందీ SA – 300 పోస్టులు
  • తెలుగు SA – 130 పోస్టులు

ఈ పోస్టులపైనే ఎక్కువగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు.

అభ్యర్థుల దరఖాస్తు విధానం

  • మండల స్థాయిలో ఎంఈవో కార్యాలయాలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి.
  • డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలి.
  • ఎంఈవో కార్యాలయాలు దరఖాస్తులను సేకరించి డీఈవో కార్యాలయాలకు పంపిస్తాయి.

మెరిట్ లిస్ట్ తయారీ విధానం

  • అకడమిక్ అర్హతకు – 75% వెయిటేజీ
  • ప్రొఫెషనల్ అర్హతకు – 25% వెయిటేజీ

చివరి ఎంపికను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదిస్తుంది.

డిసెంబర్ 7లోగా మొత్తం ప్రక్రియ పూర్తి

డిసెంబర్ 7 నాటికి ఎంపికలు పూర్తిచేస్తారు. డిసెంబర్ 8 నుంచే ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లు పాఠశాలల్లో విధుల్లో చేరాలి. వేతనాల చెల్లింపుల కోసం అభ్యర్థులు జాతీయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవాలని శాఖ సూచించింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి