ఇన్‌స్టా బ్యాన్‌పై అన్వేష్ బోల్డ్ రియాక్షన్ “రూపాయి రాని ఇన్‌స్టా ఉంటే ఏంటి… పోతే ఏంటి?”

ప్రపంచ యాత్రల వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ కావడంపై ఘాటు స్పందన ఇచ్చాడు. మరో కొత్త ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి వీడియో పోస్ట్ చేసిన అన్వేష్, ఇన్‌స్టా పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు.

“రూపాయి రాని ఇన్‌స్టా ఉంటే ఏంటి… పోతే ఏంటి?
ఇన్‌స్టా ఛానల్స్ prapranchayatrikudu, naa_anveshana5…
యూట్యూబ్ ఛానల్స్ నా అన్వేషణ, prapancha yatrikudu నాకు రెండు చేతులు, రెండు కాళ్ల లాంటివి.
ఫేస్‌బుక్ అకౌంట్ నా బాడీతో సమానం.
ఎన్ని అకౌంట్లు బ్యాన్ చేసినా వీడియోలు చేయడం ఆపను. అన్నీ బ్యాన్ చేసినా… వాటన్నింటినీ నడిపించే నా మైండ్‌ని ఏం చేయలేరు” అని వ్యాఖ్యానించాడు.

తన పోరాట స్పూర్తిని వివరిస్తూ,
“ఒక చెయ్యి పోతే ఇంకో చెయ్యితో, రెండు కాళ్లతో ముందుకు వెళ్తా.
రెండో చెయ్యి పోతే రెండు కాళ్లతో వెళ్తా.
కాళ్లు కూడా తీసేస్తే బాడీతో పాకుకుంటూ వెళ్తా.
అది కూడా తీసేస్తే నా బుర్రే ఆయుధంగా పనిచేస్తుంది” అంటూ ఎమోషనల్‌గా స్పందించాడు.

ఇన్‌స్టాలో తాను ఎలాంటి ప్రమోషన్లు లేదా లింకులు ఇవ్వలేదని చెప్పిన అన్వేష్,
“అయినా నా అకౌంట్ బ్యాన్ చేశారు. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తా.
గత నెల యూట్యూబ్ నుంచే రూ.8 లక్షల ఆదాయం వచ్చింది” అని వెల్లడించాడు.

ఇటీవల అన్వేష్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. భారత్ గురించి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, సీసీఎస్ పోలీసుల సూచన మేరకు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ఆయన అకౌంట్‌ను బ్యాన్ చేసినట్లు సమాచారం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి