నాగార్జున నగర్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) పాత్రికేయ విద్యా విభాగంలో దశాబ్దానికి పైగా ఫోటోగ్రాఫర్‌గా సేవలందిస్తున్న గుత్తా సునీల్ కుమార్ ప్రతిష్టాత్మకమైన *“ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2025”*ను అందుకున్నారు.
ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో, ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ (IIPC), ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (PAI) సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటో ప్రదర్శనలో ఆయనకు ప్రదానం చేశారు. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో ఈ అవార్డు అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, PAI వైస్‌ప్రసిడెంట్ డాక్టర్ కొంపల్లి సుందర్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక ఛైర్మన్ తమ్మా శ్రీనివాస రెడ్డి, అవనిగడ్డ మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ డా. గోకరాజు గంగరాజు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఆర్. మల్లిఖార్జునరావు తదితరులు ఈ అవార్డును గుత్తా సునీల్ కుమార్‌కు అందించారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా అధ్యక్షుడు గొల్ల నారాయణరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ కొంపల్లి సుందర్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
సునీల్ విజయంపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పాత్రికేయ విద్యా విభాగాధిపతి ఆచార్య డాక్టర్ కే. జ్యోతిర్మయి, డాక్టర్ జె. మధుబాబు, వర్సిటీ తాత్కాలిక ఉపకులపతి కె. గంగాధర రావు, రెక్టర్ ఆచార్య కె. రత్న షీలా మణి, తాత్కాలిక రిజిస్ట్రార్ జి. సింహాచలం, దూరవిద్యా కేంద్ర సంచాలకులు ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తదితరులు అభినందనలు తెలిపారు.



