ANU డిప్లమో ఇన్ జర్నలిజం సప్లిమెంటరీ పరీక్షలు.

anu-pg-icet-engineering-entrance-exams-dates-2025

ANU;ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు ఆంధ్రప్రదేశ్ సి.ఆర్, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన డిప్లమో ఇన్ జర్నలిజం (ఆన్ లైన్) కోర్స్ కు సంభవించి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ,ప్రెస్ అకాడమీ తెలిపాయి.ఈ పరీక్షల ద్వారా గతంలో డిప్లమో ఇన్ జర్నలిజం కోర్స్ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రస్తుత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కొద్దిరోజులు క్రితం కూడా తెలిపారు.

ఇకపోతే ఆగష్టు నెల తేది.11 నుండి 14 వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే ఈ డిప్లమా కోర్స్ ఇన్ జర్నలిజం (సప్లిమెంటరీ) పరీక్షలు, ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:30 వరకు నిర్వహించబడ తాయి.పరీక్ష ఫీజు చెల్లించిన వారికి పరీక్షల హాల్ టికెట్లు యూనివర్సిటీ లోనీ పరీక్షా సెంటర్ (హిస్టరీ డిపార్ట్మెంట్) వద్ద ప్రొఫెసర్ మురళీ అందజేయనున్నారు.పరీక్ష ఫీజు చెల్లించినవారు ఎగ్జామ్ సెంటర్ కి ఎగ్జామ్ సమయానికి ఒక గంట ముందుగా వెళ్లినా హాల్ టికెట్ అందుకోవచ్చని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి