ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక ప్రకటన చేశారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈవీఎంల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతాయని కూడా స్పష్టం చేశారు.

నీలం సాహ్ని మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమగ్రతకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను దశలవారీగా వివరించారు.

ఎన్నికల షెడ్యూల్ ముఖ్యాంశాలు:

  • అక్టోబర్ 15, 2025 లోపు: వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
  • అక్టోబర్ 16 – నవంబర్ 15, 2025: వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి.
  • నవంబర్ 1 – 15, 2025: ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తిచేయాలి.
  • నవంబర్ 16 – 30, 2025: పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసి, ఈవీఎంల సిద్ధత, సేకరణ ప్రక్రియ ముగించాలి.
  • డిసెంబర్ 15, 2025 లోపు: రిజర్వేషన్లను ఖరారు చేయాలి.
  • డిసెంబర్ 2025 చివరి వారంలో: రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
  • జనవరి 2026: ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలను ప్రకటించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉత్సుకత

ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్ల ఖరారుతో పాటు వార్డుల పునర్విభజన ప్రక్రియపై అన్ని పార్టీల దృష్టి నిలిచింది. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికలను ఎలాంటి లోపం లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి