ఆంధ్రప్రదేశ్ “లా-సెట్”, పి.జి,ఎల్.సెట్-2025 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్-2025, ఏపీ పీ.జీ,ఎల్‌సెట్-2025 ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది లాసెట్ పరీక్షల్లో మొత్తం 95% ఉత్తీర్ణత నమోదు కాబడినట్లు మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా వెల్లడించారు.ఈ పరీక్షలకు మొత్తం 27,253 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 20,826 మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. మరోసారి బాలికలే టాపర్లుగా నిలిచి తమ ప్రతిభను చాటారని మంత్రి ప్రశంసించారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల ఎల్.ఎల్‌.బీ,తో పాటు పీ.జీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన ఏపీ లాసెట్-2025 పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన విషయం విదితమే.

పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు cets.apsche.ap.gov.in/LAWCET/ అనే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. హోమ్ పేజీలో కనిపించే లాసెట్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేసిన అనంతరం తమ రిజిస్ట్రేషన్ నంబర్, లాసెట్ హాల్‌టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను అక్కడ నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అలాగే అడ్మిషన్ల ప్రక్రియలో ఈ ర్యాంక్ కార్డు చాలా కీలకమైనది కాబట్టి దీన్ని విద్యార్థులు భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించడం జరుగుతుంది.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ సర్వీస్ ద్వారా ఈ లా సెట్ ఎంట్రెన్స్ పరీక్షా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.దీని కోసం 9552300009 అనే వాట్సాప్ గవర్నెన్స్ నంబర్‌కు విద్యార్థులు ‘Hi’ అని మెసేజ్ పంపి, ఆ తర్వాత ‘విద్యా సేవలు’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని, ‘ఏపీ లాసెట్ ఫలితాలు- 2025’ పై క్లిక్ చేయడం వల్ల ర్యాంక్ కార్డును లా సెట్ ఎంట్రన్స్ విద్యార్థులు పొందవచ్చు.లాసెట్ పరీక్షలో వారు సాధించిన ర్యాంకులను, రిజర్వేషన్ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులకు ఎంపికైన కళాశాలల్లో చదువు కునేం దుకు సీట్లను కేటాయించ డం జరుగుతుంది. ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, ఉన్నత విద్యామండలి త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించనుంది. దీని ద్వారా దశలవారీగా సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి