నేటి కాలంలో విద్య, వైద్యం అనే రెండు రంగాలు సాధారణ ప్రజలకు అందని విలాసాలుగా మారిపోయాయి. నాణ్యమైన చదువు, corporate స్థాయి వైద్య సేవలు ఇప్పుడు మధ్య తరగతి వరకు కూడా భారమైపోతున్నాయి. అలాంటి సమయంలో “పూర్తిగా ఉచితంగా” corporate-లాగే మెడికల్ సర్వీస్ అందించే ఆస్పత్రి ఉందనడం వింతగా అనిపించొచ్చు. కానీ కృష్ణా జిల్లా కూచిపూడిలో అలాంటి అసాధారణ ఆరోగ్య కేంద్రం వాస్తవంగా ప్రజలకు సేవలందిస్తోంది. అదే రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆసుపత్రి.
శాస్త్రీయ నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కూచిపూడి గ్రామంలో, పక్కన ఉన్న 70 గ్రామాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలను ఒక రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్న ఈ ఆస్పత్రి ఇప్పుడు రాష్ట్రంలో సేవా భావానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవల BJP నేత సాధినేని యామిని శర్మ ఈ ఆస్పత్రిని సందర్శించి, అక్కడి సదుపాయాలను దగ్గరగా పరిశీలించారు. అనంతరం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంజీవని ఆస్పత్రి గురించి ఆమె ఇలా వ్యాఖ్యానించారు:
“భారతదేశ శాస్త్రీయ నృత్య రాజధాని కూచిపూడి మధ్యలో ఉన్న ఈ అసాధారణ ఆసుపత్రి నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది కేవలం ఆస్పత్రి కాదు… మానవత్వం ఎలా ఉండాలో చూపించే సేవా సంస్థ. దాతృత్వంతో నడిచే ఈ ప్రపంచ స్థాయి ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు అన్నీ సున్నా ఖర్చుతో అందిస్తున్నారు. ఇక్కడ బిల్లు లేదు… షరతులు లేవు… వివక్షలేదు.
సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల దార్శనికతతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాశ్ గారి సహకారంతో ఏర్పడిన ఈ ఆస్పత్రి మౌలిక సదుపాయాలు, పరికరాలు—all of them reflect dedication, compassion, and nation-building.”*
ఈ ట్వీట్‌తో సంజీవని ఆస్పత్రి మళ్లీ మీడియా దృష్టిని ఆకర్షించింది.
200 పడకల సామర్థ్యం – 70 గ్రామాలకు సేవ
కూచిపూడిలో సిలికాన్ ఆంధ్ర సంస్థ ఆధ్వర్యంలో 200 పడకలతో నిర్మించిన ఈ ఆస్పత్రి, పూర్తిగా దాతృత్వం ఆధారంగా నడుస్తోంది. స్థానికంగా అందించే దాతల సహాయం కూడా దీనికి బలంగా నిలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు రవిప్రకాశ్ ఈ ఆస్పత్రి ఏర్పాటులో భారీగా ఆర్థిక సహాయం అందించారు.
ప్రాంతంలోని 70కు పైగా గ్రామాల ప్రజలకు ఈ ఆస్పత్రి ఆశగా మారింది. ఇంతకు ముందు చిన్నా–పెద్దా చికిత్స కోసం విజయవాడకు వెళ్లాల్సిన స్థితి ఉండేది. ఇప్పుడు అదే సేవలు గ్రామ దరి చేరడంతో వందలాది కుటుంబాలు ఆర్థిక భారాన్ని తప్పించుకుంటున్నాయి.
అధునాతన వైద్య విభాగాలు – కార్పొరేట్ స్థాయి సదుపాయాలు
ఈ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్‌తో పాటు క్రింది విభాగాలు అందుబాటులో ఉన్నాయి:
- కార్డియాలజీ
- గైనకాలజీ
- పీడియాట్రిక్స్ (చిన్న పిల్లల విభాగం)
- అత్యాధునిక ICUలు
- పూర్తి స్థాయి ఆపరేషన్ థియేటర్లు
- డయాగ్నస్టిక్స్ ల్యాబ్
గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి corporate-level medical infrastructure ఉండటం అరుదు. ముఖ్యంగా పూర్తిగా ఉచిత సేవలు ఉండటం ఈ ఆస్పత్రి విశిష్టత.
సేవ, దాతృత్వం, మానవత్వం కలిసిన ప్రాజెక్ట్
సిలికాన్ ఆంధ్ర సంస్థ, దాని వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల దార్శనికత, రవిప్రకాశ్ వంటి సేవాభావం ఉన్న వ్యక్తుల సహకారంతో, సంజీవని ఆస్పత్రి గ్రామీణ ఆరోగ్య సేవలకు ఒక కొత్త ప్రమాణం సృష్టిస్తోంది. వ్యాధి నిర్ధారణ నుంచి శస్త్రచికిత్స వరకూ అన్ని సేవలు ఉచితంగా అందించడం ద్వారా ఇది కేవలం ఆస్పత్రి కాకుండా సేవామూర్తిగా ఎదుగుతోంది.


