ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026–27: రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి ఆయన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం.

ఈ బడ్జెట్ మొత్తం రూ. 3,32,205 కోట్లుగా ఉండగా,

  • రెవెన్యూ వ్యయం: రూ. 2,56,143 కోట్లు
  • మూలధన వ్యయం: రూ. 53,915 కోట్లు
  • రెవెన్యూ లోటు: రూ. 22,002 కోట్లు
  • ద్రవ్య లోటు: రూ. 75,868 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు:

  • పాఠశాల విద్య – రూ. 32,308 కోట్లు
  • బీసీ సంక్షేమం – రూ. 23,650 కోట్లు
  • పంచాయతీ రాజ్ – రూ. 22,941 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖ – రూ. 19,306 కోట్లు
  • జలవనరుల శాఖ – రూ. 18,223 కోట్లు
  • మున్సిపల్ శాఖ – రూ. 14,538 కోట్లు
  • ఇంధన శాఖ – రూ. 13,934 కోట్లు
  • వ్యవసాయ శాఖ – రూ. 11,118 కోట్లు
  • సాంఘిక సంక్షేమ శాఖ – రూ. 11,118 కోట్లు
  • ఈడబ్ల్యూఎస్ సంక్షేమం – రూ. 10,699 కోట్లు
  • తల్లికి వందనం – రూ. 9,668 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం – రూ. 4,581 కోట్లు
  • స్కాలర్షిప్స్ – రూ. 3,836 కోట్లు
  • సమగ్ర శిక్షణ – రూ. 2,946 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖ – రూ. 2,566 కోట్లు
  • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ. 2,161 కోట్లు
  • మనబడి – మన భవిష్యత్తు – రూ. 1,500 కోట్లు
  • స్కిల్ డెవలప్‌మెంట్ – రూ. 1,232 కోట్లు
  • పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ. 707 కోట్లు
  • సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర – రూ. 654 కోట్లు
  • యువత & క్రీడలు – రూ. 438 కోట్లు

ప్రత్యేక కేటాయింపులు:

  • అమరావతి అభివృద్ధికి – రూ. 6,000 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులకు – రూ. 9,906 కోట్లు
  • అన్నదాత సుఖీభవ – రూ. 6,600 కోట్లు
  • పోలవరం ప్రాజెక్టు – రూ. 6,105 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ. 1,927 కోట్లు
  • మత్స్యకార సేవ – రూ. 260 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు
  • పంటల బీమా – రూ. 250 కోట్లు
  • పీఎం కృషి సించాయి యోజన – రూ. 190 కోట్లు
  • పర్యావరణం, అటవీ & విజ్ఞానశాస్త్రం – రూ. 714 కోట్లు
  • పట్టణాభివృద్ధి శాఖ – రూ. 14,539 కోట్లు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి